Arshdeep: టీ20ల్లో భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. బుమ్రా, చాహ‌ల్‌ను వెనక్కినెట్టేసి అగ్రస్థానంలోకి..

Arshdeep Singh: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

Arshdeep: టీ20ల్లో భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. బుమ్రా, చాహ‌ల్‌ను వెనక్కినెట్టేసి అగ్రస్థానంలోకి..

Arshdeep Singh

Updated On : January 23, 2025 / 8:51 AM IST

Arshdeep: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టుపై సునాయాస విజయం సాధ్యమైంది. అయితే, ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Also Read: Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. బట్లర్ షాక్.. వీడియో వైరల్

ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో పురుషుల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ లను అవుట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ తన 61వ టీ20 మ్యాచ్ లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది.

Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌.. యువరాజ్ సింగ్ 12ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

యుజ్వేంద్ర చాహల్ 80 మ్యాచ్ లలో 96 వికెట్లు పడగొట్టి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ కేవలం 61 మ్యాచ్ లలోనే అధిగమించాడు. 97వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అర్షదీప్, చాహల్ తరువాత ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో హార్ధిక్, భువనేశ్వర్ కుమార్, జస్ర్పీత్ బుమ్రాలు కూడా ఉన్నారు. భువనేశ్వర్ 87 మ్యాచ్ లలో 90 వికెట్లు పడగొట్టగా.. జస్ర్పీత్ బుమ్రా 70 మ్యాచ్ లలో 89 వికెట్లు తీశాడు. ఇక హార్ధిక్ పాండ్యా 109 మ్యాచ్ లలో 89 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.

 

ఇదిలాఉంటే.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా న్యూజిలాండ్ ప్లేయర్ టీమ్ సౌథీ కొనసాగుతున్నాడు. అతను 126 మ్యాచ్ లలో 165 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ (161), బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హసన్ (149), న్యూజిలాండ్ బౌలర్ ఇష్‌ సోధీ (138), బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (132) టాప్ -5లో ఉన్నారు. ఈ జాబితాలో అర్ష్ దీప్ సింగ్ 22వ స్థానంకు చేరుకున్నాడు. ఇదిలాఉంటే.. అర్ష్ దీప్ సింగ్ 2024 టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. అదేవిధంగా 2022 టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు.