Asia Cup 2025 : ఉత్కంఠ పోరులో అతని వల్లే విజయం.. బుమ్రా, దూబెలను పక్కన పెట్టింది అందుకే.. భారత కెప్టెన్ సూర్యకుమార్ కామెంట్స్
Asia Cup 2025 IND vs SL : ఆసియా కప్ 2025 సూపర్ -4లో శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

Asia Cup 2025 IND vs SL
Asia Cup 2025 IND vs SL : ఆసియా కప్ 2025 సూపర్ -4లో శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియా కప్ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది.
Also Read: KL Rahul : కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా-ఏ పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్‌లా అనిపించింది. ఫలితం గురించి ఆలోచించకుండా ఆఖరి వరకు గెలుపుకోసం శ్రమించాలని జట్టు సభ్యులకు చెప్పాను. ఈ మ్యాచ్ ను సెమీఫైనల్లా భావించి ఆడాలని సూచించినట్లు తెలిపారు. అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తరువాత సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆ టెంపోను కొనసాగించారు. అర్ష్‌దీప్ సింగ్ చాలాసార్లు సూపర్ ఓవర్ వంటి క్లిష్ట ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను మాకు అనేక విజయాలు అందించాడు.
సూపర్ ఓవర్‌కు అర్ష్‌దీప్ సింగ్ తప్ప మరో ఆప్షన్ నాకు కనిపించలేదు. ఎక్కువ ఆలోచించకుండా నీ ప్రణాళికలను నమ్ముకొని, వాటిని అమలు చేయాలని మాత్రమే నేను అతనికి చెప్పాను. అతను అద్భుత బౌలింగ్ తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతని కారణంగానే ఓడిపోయే మ్యాచ్ లో విజయం సాధించాం. ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని సూర్యకుమార్ అన్నారు. ఇదిలాఉంటే.. టాస్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. మా జట్టులో రెండు మార్పులు చేశాం. జస్ర్పీత్ బుమ్రా, శివం దూబే స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులోకి వచ్చారు. ఫైనల్ ముంగిట దూబే, బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని అనుకున్నాం. అందుకే వారిని పక్కన పెట్టామని సూర్య చెప్పారు.
Team India be like, 2️⃣ tera 2️⃣ mera 😅
Watch #DPWORLDASIACUP2025 – LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvSL pic.twitter.com/fQluP9mg6M
— Sony LIV (@SonyLIV) September 26, 2025
ఈ మ్యాచ్‌లోతొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సంజు సామ్సన్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్స్‌లు)కూడా కీలక పరుగులు సాధించడంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. 203 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కూడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో భారత్ విక్టరీ కొట్టింది.
Surya dada ne poora kiya ek aur jeet ka wada 👏
Watch #DPWORLDASIACUP2025 – LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvSL pic.twitter.com/v7oRcwzTat
— Sony LIV (@SonyLIV) September 26, 2025
సూపర్ ఓవర్లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. ఒక ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయి కేవలం 2 పరుగులు మాత్రమే శ్రీలంక చేయగలిగింది. దీంతో మూడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. మొదటి బంతికే విజయం సాధించింది. హసరంగ వేసిన తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. మూడు పరుగులు తీశాడు. దాంతో లంకపై భారత్ విజయం సాధించింది.