Asian Games 2023 : చైనా వేదికగా ఆసియా క్రీడలు.. బీసీసీఐ కీలక నిర్ణయం..? రోహిత్, కోహ్లిని పంపేదే లే..!
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ఆసియా క్రీడలు(Asian Games) 2023 ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి ఈ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు.

BCCI Agrees To Send Cricket Teams
Asian Games : సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ఆసియా క్రీడలు(Asian Games) 2023 ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి ఈ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు. ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ కు ఈ గేమ్స్‌లో అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ రెండు సందర్భాల్లో టీమ్ఇండియా మాత్రం ఆడలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు మాత్రమే ఆడాయి. బిజీ షెడ్యూల్ కారణంగానే భారత జట్టును పంపలేదని బీసీసీఐ(BCCI) ఆ సందర్భాల్లో తెలిపింది.
European Cricket League T10 : బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వే గదయ్యా..! వీడియో వైరల్
కాగా.. ఈ సారి మాత్రం టీమ్ఇండియా ఆడే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారత పురుషుల, మహిళల జట్లు రెండింటిని బీసీసీఐ పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే.. అక్టోబర్‌లో స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో పురుషుల ద్వితీయ శ్రేణి జట్టును పంపనుందట. కాగా.. మహిళల సీనియర్ జట్టును పంపించేందుకు అంగీకరించిందట. ఈ మేరకు తమ ఆటగాళ్ల జాబితాను జూన్ 30 లోపు భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు బీసీసీఐ పంపనుందని ఓ ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఏషియన్ గేమ్స్ మిషన్ చీఫ్ భూపేందర్ బజ్వా మాత్రం బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదని చెప్పారు. ఆసియా క్రీడల్లో ఒక్క క్రికెట్ తప్ప మిగిలిన అన్ని ఈవెంట్లలో భారత్ పాల్గొనుందని తెలిపారు. ఇప్పటి వరకు బీసీసీఐకి చాలా సార్లు మెయిల్స్ పంపించామని అయితే గేమ్స్ జరిగే సమయంలో బిజీ షెడ్యూల్ ఉండడంతో జట్లను పంపలేమని చెప్పినట్లు ఆయన తెలిపారు. బీసీసీఐ దీనిపై త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన చేయనుంది.