Asian Games : మ‌రో రెండు స్వ‌ర్ణాలు.. ఆసియా క్రీడ‌ల్లో దూసుకుపోతున్న భార‌త్‌

ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్ భార‌త ఖాతాలో వ‌చ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో స్వ‌ర్ణ‌ప‌త‌కాలు ల‌భించాయి.

Asian Games : మ‌రో రెండు స్వ‌ర్ణాలు.. ఆసియా క్రీడ‌ల్లో దూసుకుపోతున్న భార‌త్‌

Asian Games 2023

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్ భార‌త ఖాతాలో వ‌చ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో స్వ‌ర్ణ‌ప‌త‌కాలు ల‌భించాయి. స్టీపుల్‌ఛేజ్‌ 3000 మీటర్ల రేసులో అవినాశ్ సాబ్లే గెలుపొంద‌గా, షాట్‌పుట్‌లో తేజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్ లు విజ‌యం సాధించి గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్కించుకున్నారు. అంతకుముందు హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్‌ 50కేజీల విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ క్రీడ‌ల్లో భార‌త ప‌త‌కాల సంఖ్య 45కి చేరింది. ఇందులో 13 స్వ‌ర్ణ‌, 16 ర‌జ‌త‌, 16 క్యాంస ప‌త‌కాలు ఉన్నాయి.

Pakistan Cricketers : హైద‌రాబాద్‌లో పాక్ ఆట‌గాళ్ల షికార్లు.. రెస్టారెంట్‌లో డిన్న‌ర్‌.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డిన ఫ్యాన్స్‌..

ప్ర‌స్తుతం ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ నాలుగో స్థానంలో ఉంది. 233 ప‌త‌కాల‌తో అతిథ్య చైనా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఇందులో 124 స్వ‌ర్ణ‌, 71 ర‌జ‌త‌, 38 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. 122 ప‌త‌కాల‌తో రెండో స్థానంలో రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా ఉంది. ఇందులో 30 స్వ‌ర్ణ, 34 ర‌జ‌త‌, 58 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. మూడో స్థానంలో జ‌పాన్ 110 ప‌త‌కాల‌తో ఉంది. ఇందులో 29 స్వ‌ర్ణ‌, 40 ర‌జ‌త‌, 41 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.