Deepak Punia : ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్.. దీపక్ పునియాకు సిల్వర్
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ పునియా రజతం సాధించాడు. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అజామత్ చేతిలో 1-6 తేడాతో ఓటమి చెందాడు.

Deepak Punia
Deepak Punia : ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ పునియా రజతం సాధించాడు. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అజామత్ దౌలెట్‌బెకోవ్ తో తలపడ్డాడు. 1-6 తేడాతో ఓటమి చెందాడు. దీంతో రజతంతో సరిపెట్టుకున్నాడు.
IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం
ఇప్పటివరకు ఆసియా రెజ్లింగ్‌లో దీపక్ పునియా మూడు పతకాలు గెలుచుకున్నాడు. తాజా విజయంతో నాలుగో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2021లో రజతం గెలవగా.. 2019, 2020లో కాంస్యాన్ని గెలుచుకున్నాడు. మరోవైపు 92 కేజీల విభాగంలో విక్కీ చాహర్ కాంస్యం సాధించాడు.