Alyssa Healy : నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ఇదే.. ఫోటోగ్రాఫర్‌గా మారిన ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ.. ఎందుకో తెలుసా..?
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Alyssa Healy turns photographer
Alyssa Healy turns photographer : భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా పై టెస్టుల్లో భారత మహిళలకు ఇదే మొదటి విజయం కావడం విశేషం. మ్యాచ్ అనంతరం ట్రోఫీ అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది.
భారత జట్టుకు సంబంధించిన అద్భుతమైన క్షణాలను అలీసా హీలీ కెమెరాతో బంధించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీలీ యొక్క క్రీడాస్ఫూర్తి, సహృదయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా.. తాను ఫోటో తీయడం పై హీలీ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు భారత జట్టులోని సగం మంది ఎలా తొలగించిందో చెప్పుకొచ్చింది.
Suresh Raina : ఇలా కూడా పిలుస్తారా? పెళ్లికి ధోని ఎలా పిలిచాడో చెప్పిన సురేశ్ రైనా.. వీడియో వైరల్
వాస్తవానికి అది తన కెమెరా కాదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కెమెరామెన్ ను వెనక్కి నెట్టారు. నేను ఒకటే భావించాను. జట్టును చాలా దగ్గరి నుంచి ఫోటోలు తీసి ఇవ్వొచ్చునని అనుకున్నాను. అయితే.. వాస్తవానికి సగం ఇండియన్ టీమ్‌ను ఫోటోలో పడకపోవడానికి కారణం అయ్యాను. ఆ ఫోటోను సదరు ఫోటో గ్రాఫర్ ఉపయోగిస్తాడని తాను భావించడం లేదని చెప్పింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ముందు 74 పరుగుల లక్ష్యం నిలిచింది. స్మృతి మంధాన (38 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్)లు రాణించడంతో 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి భారత్ గెలుపొందింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు తీసిన స్నేహ్ రాణా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.
Spirit of Cricket ?
Australia Captain Alyssa Healy on that gesture to click a special moment, ft. #TeamIndia ? ?#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/PJ6ZlIKGMb
— BCCI Women (@BCCIWomen) December 24, 2023