Australia cricket fan : పిచ్చి పీక్స్ ఇంటే ఇదేనేమో.. మ్యాచ్ టికెట్ కొనడం మరిచిపోయి.. 58 గంటల ప్రయాణం..ట్విస్ట్ ఏంటంటే..?
తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో పాటు ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా విక్రయం ప్రారంభించిన మూడు రోజుల్లోనే టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. అయితే.. ఆస్ట్రేలియా జట్టు అంటే పిచ్చి అభిమానం ఉన్న టాస్మానియాకు చెందిన మాట్ మ్యాచ్ చూడాలని అనుకున్నాడు.

Australia cricket fan travels 58 hours
Australia cricket fan travels 58 hours: మన దేశంలో క్రికెట్ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఎందరో ఉంటారు. అయితే విదేశాల్లోనూ ఇంతలా క్రికెట్‌ను ప్రేమించే అభిమానులు ఉంటారా..? అన్న సందేహం అప్పుడప్పుడు కలగక మానదు. అయితే.. ఇక్కడో అభిమాని గురించి తెలిస్తే.. ఔరా మరీ ఇంత పిచ్చా..? అని అనక మానరు. మ్యాచ్ చూసేందుకు అని ఏకంగా 58 గంటలు ప్రయాణం చేసి వచ్చాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మ్యాచ్ చూసేందుకు అతడి వద్ద టికెట్ సైతం లేదు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జూన్ 28 న ప్రారంభమైంది. తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో పాటు ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా విక్రయం ప్రారంభించిన మూడు రోజుల్లోనే టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. అయితే.. ఆస్ట్రేలియా జట్టు అంటే పిచ్చి అభిమానం ఉన్న టాస్మానియాకు చెందిన మాట్ మ్యాచ్ చూడాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా మరేవీ ఆలోచించలేదు. మ్యాచ్ టికెట్ సంగతి తరువాత చూసుకుందాం ముందు లార్డ్స్ కు వెళ్లాలని అనుకున్నాడు. ఇక అంతే చైనా, సైప్రస్‌ల మీదుగా 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసి లార్డ్స్ మైదానం వద్దకు చేరుకున్నాడు. స్టేడియంలోకి వెళ్లాలి అంటే టికెట్ కావాల్సిందే. ఎంత ప్రయత్నించినా అతడికి టికెట్ దొరకలేదు. దీంతో అతడు చేతిలో ఓ ఫ్లకార్డు పట్టుకుని స్టేడియం బయట నిలబడ్డాడు.
Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj
— England’s Barmy Army ???????? (@TheBarmyArmy) June 28, 2023
దానిపై నేను 58 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. మ్యాచ్ చూడాలని. దయచేసి నాకు ఓ టికెట్ ఇప్పించండి అని రాసి ఉంది. కొన్ని గంటల పాటు అతడు అలాగే నిలుచుకున్నాడు. అతడిని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి తన టికెట్‌ను మాట్ కు ఇచ్చాడు. దీంతో రెండో టెస్టు మొదటి రోజు మూడో సెషన్ సమయంలో మాట్ స్టేడియంలోపలికి వెళ్లి మ్యాచ్‌ను చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్పిన్నర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడడం కష్టమే..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.