Ashes 2023: మా కుటుంబాలకు అదనపు భద్రత కల్పించండి: ఇంగ్లండ్‌ను కోరిన ఆస్ట్రేలియా క్రికెటర్లు
మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియా గెలిస్తే ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.

Ashes 2023
Ashes 2023 – Australia: యాషెస్ సిరీస్ ఆడుతున్న సమయంలో తమ కుటుంబాలకు అదనపు భద్రత కల్పించాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు కోరారు. గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారు ఈ విజ్ఞప్తి చేశారు. ఇంగ్లండ్ (England) లోని లీడ్స్, హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్ (Headingley Cricket Ground)లో ఆతిథ్య జట్టు అభిమానులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఇంగ్లండ్ లో జరుగుతున్న 5 మ్యాచుల టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టు 5వ రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ స్టంపౌట్ చేశాడు. ఈ ఔట్ వివాదాస్పదంగా మారింది. 43 పరుగులతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది.
ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంగ్లండ్ మీడియాలోనూ దీనిపై అనేక కథనాలు వచ్చాయి. రెండో టెస్టు జరుగుతున్నప్పుడు మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ఇంగ్లండ్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వారికి భద్రత పెంచాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు కోరారు. కాగా, మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియా గెలిస్తే ఈ సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంటుంది.