Bairstow Out controversy: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ‘క్రై బేబీ’గా పేర్కొన్న ఆసీస్ మీడియా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టోక్స్

జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ పై ఆసీస్ మీడియాకూడా ఇంగ్లాండ్ జట్టుపై విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో ‘ద వెస్ట్ ఆస్ట్రేలియాన్’ అనే పత్రిక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్‌ను ప్రచురించింది.

Bairstow Out controversy: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ‘క్రై బేబీ’గా పేర్కొన్న ఆసీస్ మీడియా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టోక్స్

Ben Stokes

Updated On : July 4, 2023 / 12:51 PM IST

Ashes Test: యాషెస్ టెస్ట్ సిరీస్‌ (Ashes Test Series) లో భాగంగా రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో  (Jonny Bairstow) వివాదాస్పద స్టంపౌట్‌ ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్  (England) మధ్య పెద్ద వివాదానికే దారితీసింది. ఈ వివాదంపై ఏకంగా ఇరు దేశాల ప్రధానులుసైతం స్పందించారు. తాజాగా ఆసీస్ మీడియా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై అభ్యంతరకర కార్టూన్‌ను ప్రచురించింది. దీనిపై స్పందించిన బెన్ స్టోక్స్ ఆసీస్ మీడియాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

యాషెస్ రెండో టెస్టులో భాగంగా.. తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ బౌలర్ గ్రీన్ బౌన్సర్ వేయడంతో దానిని తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. ఆ బాల్ కీపర్ అలెక్స్ చేతులోకి వెళ్లింది. ఓవర్ అయిపోయింది అనుకొని బెయిర్‍‌స్టో క్రీజు దాటాడు. అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్ బెయిర్ స్టోను స్టంపౌట్ గా ప్రకటించాడు. ఇది కాస్త తీవ్రదుమారంకు దారితీసింది.

England vs Australia Ashes Test: బెన్ స్టోక్స్ పోరాడినా ఫలితం దక్కలే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాదే విజయం

ఇరు దేశాల ప్రధానులు ఎంట్రీ..

బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం ఇరు దేశాల మాజీ క్రికెట్ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అంతేకాదు.. ఇరు దేశాల ప్రధానులు ఈ అంశంపై స్పందించారు. బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్ పై ఇంగ్లాండ్ ప్రధాని సునాక్ ప్రతినిధి స్పందించారు. ఈ ఔట్ కేవలం ఆటలోభాగం మాత్రమే కాదు క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆస్ట్రేలియా వలె తాము గెలవాలనుకోవట్లేదని చెప్పారు. దీనికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పందించారు. ఆస్ట్రేలియా పురుషులు, మహిళల క్రికెట్ జట్టుపై నేను గర్వంగా ఉన్నాను. ఆసీస్ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. గెలిచిన వారిని సాదరంగా ఆహ్వానించేందుకు ఎదురు చూస్తున్నాం అని అల్బనీస్ అన్నారు.

Ashes : వ‌రుస‌గా రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. ఇప్పుడెలా..?

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్.. 

జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ పై ఆసీస్ మీడియాకూడా ఇంగ్లాండ్ జట్టుపై విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో ‘ద వెస్ట్ ఆస్ట్రేలియాన్’ అనే పత్రిక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్‌ను ప్రచురించింది. ఈ ఇమేజ్‌లో బెన్ స్టోక్స్ చిన్నపిల్లవాడి వేషంలో పాలపీక నోట్లో పెట్టుకొని బాల్‌ను అందుకొనేలా ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో స్టోక్స్ దృష్టిలో పడటంతో తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ద వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రికను పోస్టు చేసి.. కచ్చితంగా అది నేనైతే కాదు.. నేనెప్పుడూ కొత్త బాల్ తో బౌలింగ్ చేశాను’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ ఆసీస్ మీడియాకు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.