Babar Azam Fined : బాబర్ ఆజాంకు షాకిచ్చిన పోలీసులు.. కారును ఆపి మరీ..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)కు పోలీసులు జరిమానా విధించారు. ఆయన అతి వేగంతో కారు నడపడమే అందుకు కారణం.
Babar Azam : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)కు పోలీసులు జరిమానా విధించారు. ఆయన అతి వేగంతో కారు నడపడమే అందుకు కారణం. టైమ్స్ ఆఫ్ కరాచీ నివేదిక ప్రకారం.. బాబర్ ఆజాం అతివేగంతో పంజాబ్ హైవేలో తన ఆడి కారును నడిపాడు. రోడ్డుపై నిర్దేశించిన స్పీడ్ కంటే అతి వేగంగా నడిపి నిబంధనలు ఉల్లంఘించడంతో పంజాబ్ మోటర్ వే పోలీసులు అతడి కారును ఆపి ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఎంత మొత్తాన్ని జరిమానాగా విధించారు అన్న సంగతి అయితే తెలియరాలేదు. కాగా.. ఈ పాక్ కెప్టెన్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు నడిపి అతడు పోలీసులకు చిక్కడంతో అప్పుడు జరిమానా పడింది.
బుధవారం హైదరాబాద్‌కు రానున్న పాక్ జట్టు..
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టు బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. గత కొద్ది రోజులు ఉన్న వీసా సమస్యలు క్లియర్ అయ్యాయి. పాక్ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. దీంతో పాక్ జట్టు బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయలు దేరి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు రానుంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం న్యూజిలాండ్ జట్టుతో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదే..
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాస్ జూనియర్
The captain of Pakistan, Babar Azam, has been fined by the Punjab Motorway Police ?♀️ for speeding.#TOKSports | #BabarAzam pic.twitter.com/cGdJ1WW7s3
— TOK Sports (@TOKSports021) September 25, 2023