BCCI Central Contracts : సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించిన బీసీసీఐ.. ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌ రీఎంట్రీ.. 34 మందికి చోటు..

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2024-25 సీజ‌న్ కోసం సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించింది.

BCCI  Central Contracts : సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించిన బీసీసీఐ.. ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌ రీఎంట్రీ.. 34 మందికి చోటు..

BCCI announces annual player retainership 2024 25 Team India

Updated On : April 21, 2025 / 12:11 PM IST

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2024-25 సీజ‌న్ కోసం సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించింది. 2023-2024 సీజ‌న్‌లో జాబితాలో చోటు ద‌క్కించుకోని శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల‌కు తాజా జాబితాలో చోటు ద‌క్కింది. టీ20క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన‌ప్ప‌టికి విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఏ ఫ్ల‌స్ కేట‌గిరిలోనే కొన‌సాగించారు. వీరితో పాటు బుమ్రా సైతం ఏ ఫ్ల‌స్ జాబితాలో ఉన్నాడు.

అటు రిషభ్‌ పంత్‌ను బి కేటగిరి నుంచి ఏ కేట‌గిరిలోకి వ‌చ్చాడు. రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి అనేక మంది యువ ఆట‌గాళ్లకు తొలి కాంట్రాక్టులు లభించాయి.

CSK qualification scenario : ఇప్పటికీ చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్.. ఇలా జరగాల్సిందే..

బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో 4 (A+, A, B, C) కేట‌గిరీలుగా విభ‌జించింది.

గ్రేడ్ A+
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A
మ‌హ్మ‌ద్ సిరాజ్‌, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మ‌హ్మ‌ద్‌ షమీ, రిషబ్ పంత్

MI vs CKS : ధోని రివ్య్వూ సిస్ట‌మ్ పాడైందా?.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

గ్రేడ్ B
సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్

గ్రేడ్ C
రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంస‌న్‌, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

MI vs CSK : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడ‌డంపై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్‌.. ఇది నా నిర్ణ‌యం కాదు.. కానీ..

ఆట‌గాళ్ల‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద్వారా ఎంత మొత్తం ల‌భిస్తుందంటే..
గ్రేడ్ A+ జాబితాలో ఉన్న ఆట‌గాళ్ల‌కు సంవత్సరానికి రూ.7 కోట్లు ల‌భిస్తాయి. గ్రేడ్ Aలో ఉన్న ప్లేయ‌ర్ల‌కు రూ.5 కోట్లు, గ్రేడ్ Bలోని ఉన్న ఆట‌గాళ్ల‌కి ​​రూ.3 కోట్లు, గ్రేడ్ C లోని ఆట‌గాళ్ల‌కి రూ.1 కోటి జీతంగా ద‌క్కుతుంది.