CSK qualification scenario : ఇప్పటికీ చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్.. ఇలా జరగాల్సిందే..
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయా?

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిష్టింగా విఫలమైన ధోని సేన 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.
ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -1.392గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆఖరి (10వ) స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్, సన్‌రైజర్స్ కూడా నాలుగు పాయింట్లతో ఉన్నప్పటికి కూడా ఆయా జట్ల రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండడంతో అవి చెన్నై కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
MI vs CKS : ధోని రివ్య్వూ సిస్టమ్ పాడైందా?.. సోషల్ మీడియాలో వైరల్..
ప్లేఆఫ్స్ ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే?
ముంబైతో ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. అయితే.. ఈ సీజన్‌లో చెన్నై మరో ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో కూడా చెన్నై విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంది.
ఒకవేళ 5 మ్యాచ్‌ల్లో గెలిచి ఒక్క మ్యాచ్‌లో ఓడినా కూడా అవకాశాలు ఉంటాయి. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాలు, సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆరింటిలో రెండు మ్యాచ్‌లు ఓడినా కూడా ఆ జట్టు రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ప్రస్తుతం చెన్నై ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఏదైన మహాద్భుతం జరగాల్సిందే.
MI vs CSK : ముంబైతో ఓటమి తరువాత ధోని కామెంట్స్ వైరల్.. ఐపీఎల్ 2026 ఫైనల్ XI పైనే దృష్టి..