BCCI Big Update: బంగ్లాతో మూడో వన్డే నుంచి రోహిత్ శర్మ ఔట్.. టెస్ట్ సిరీస్‌లో ఆడే విషయంపై బీసీసీఐ ఏమన్నదంటే?
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర్మ ఆడడని బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.

Rohit sharma
BCCI Big Update: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ డిసెంబర్ 14న చటోగ్రామ్‌లో ప్రారంభమవుతుంది. రెండు టెస్టులు టీమిండియా బంగ్లాతో ఆడుతుంది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‍లో ఆడతాడా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బంగ్లాతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే డిసెంబర్ 7న జరిగింది. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో స్లిప్‌లో క్యాచ్ పట్టేసమయంలో రోహిత్ బొటనవేలుకు గాయమైంది. బీసీసీఐ వైద్య బృందం పరిశీలించి ఢాకాలోని స్థానిక ఆసుపత్రిలో కోహిత్‌కు స్కానింగ్ చేయించారు. అయితే, మ్యాచ్ చివరిలో రోహిత్ బ్యాటింగ్ వచ్చినప్పటికీ.. అతని బొటనవేలు గాయం తీవ్రంగా వేధించింది. దీంతో స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం రోహిత్ ముంబైకి చేరుకున్నాడు. దీంతో చివరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది.
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, ఆడుతాడా? లేదా? అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానం ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి రోహిత్ శర్మ వేలికి తగిలిన గాయం తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.
? NEWS ?: Kuldeep Yadav added to #TeamIndia squad for the final ODI against Bangladesh. #BANvIND
Other Updates & More Details ?https://t.co/8gl4hcWqt7
— BCCI (@BCCI) December 9, 2022
ఇదిలాఉంటే.. ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన, దీపక్ చౌహాన్‌లు 3వ వన్డేకు, టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. వారికి గాయాల కారణంగా పక్కకు తప్పించినట్లు బీసీసీఐ తెలిపింది. మూడో వన్డే కోసం కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్ల కమిటీ జట్టులో చేర్చింది. తాజాగా బంగ్లాతో మూడో వన్డేకు బీసీసీఐ 14 మంది క్రీడాకారులతో కూడిన జట్టును ప్రకటించింది.
మూడో వన్డే కోసం భారత జట్టు :
కేఎల్ రాహుల్ (సి అండ్ డబ్ల్యూకే), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (డబ్ల్యూకే), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.