వరల్డ్ కప్ స్పెషల్ : బీర్లపై ICC డిస్కౌంట్

వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా.

వరల్డ్ కప్ స్పెషల్ : బీర్లపై ICC డిస్కౌంట్

Updated On : April 10, 2019 / 12:51 PM IST

వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా.

వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా. దీని కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముందుకొచ్చింది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానుల కోసం బీరు రేట్లను తగ్గించనుంది. బీరు తయారు చేసి అమ్మేవారు రేట్ తగ్గించరు. కస్టమర్లతో పాటుగా ప్రతి బాటిల్ పై తామూ కొంత ఇస్తామని ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ముందుకొచ్చాయి. 
Read Also : KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..

దీనికల్లా వారు పెట్టిన షరతు ఒక్కటే. మ్యాచ్ జరుగుతున్న 11 స్టేడియాల్లో ఒకే రకమైన బీర్ అమ్మాలి. ఈ విషయంలో భారత్‌కు చెందిన ‘ బీరా 91’ తో ఒప్పందం కుదుర్చుకుంది ఐసీసీ. ముందుగా నిర్వాహకులు బీరు గ్లాసు ధరను 9.70 డాలర్లు అంటే సుమారు రూ. 670గా నిర్ణయించారు. ఈ ధరపై కొద్ది చోట్ల అసంతృప్తి వ్యక్తమయింది. తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, సుమారు రూ.1000గా ఉండాల్సిందేనని పట్టుబట్టారు. 

మ్యాచ్ చూసేందుకు తరలివచ్చే అభిమానులను బీరు అధిక రేటుతో నిరాశపర్చడం సబబు కాదని భావించిన ఐసీసీ…తక్కువ రేటుకే అందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో మొత్తం దాదాపు 5 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 52 లక్షలు) సబ్సిడీ భారం ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులపై పడనుంది. దీని ప్రకారం.. బీర్ల కోసం 2 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) నష్టాన్ని భరించేందుకు ఐసీసీ రెడీ అయిందన్నమాట. 
Read Also : భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ