ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి..! మళ్లీ రోహిత్‌ను బతిమిలాడుకోవాల్సిందేనా?
Mumbai Indians- Hardik Pandya : ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్‌గా మారింది.

Mumbai Indians - Rohit Sharma
Mumbai Indians : ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆ జట్టు కీలక నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తాడని పేర్కొంది. దీనిపై ముంబై అభిమానులు రెండుగా చీలిపోయారు. కొందరు ముంబై నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు మాత్రం తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ముంబై జట్టుకు మరో కొత్త తలనొప్పి మొదలైనట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండకపోవచ్చునని వార్తలు వస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే వైదొలిగిన పాండ్య, ఆ తరువాత జరిగిన ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
Also Read : ఆశగా అడిగితే.. మహిళా అభిమాని హృదయాన్ని ముక్కలు చేసిన బాబర్ ఆజాం.. వీడియో
అఫ్గాన్ సిరీస్‌కు వస్తాడనుకుంటే..?
ఈ గాయం నుంచి హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతోనే దక్షిణాఫ్రికా పర్యటకు సైతం వెళ్లలేదు. అయితే.. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో పాండ్య ఆడతాడని అంతా భావించారు. కానీ.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు సైతం పాండ్య దూరంగా ఉండనున్నాడని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో ఐపీఎల్ 2024 సైతం దూరం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ వార్తల సారాంశం.

Hardik Pandya
పాండ్య విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండడంతో మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ పాండ్య విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదట.
ఒకవేళ ఈ వార్తలే నిజం గనుక అయితే.. ముంబై ఇండియన్స్‌కు కొత్త నొప్పి మొదలైనట్లే. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబైని నడిపించేది ఎవరు..? మళ్లీ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే.. ఇందుకు రోహిత్ ఇష్టపడకపోవచ్చు. అప్పుడు సీనియర్‌లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. పాండ్య గైర్హజరీ పై ఇప్పటి వరకు అయితే ముంబై స్పందించలేదు.