Team India : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించ‌ని షాక్‌..! కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..?

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

Team India : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించ‌ని షాక్‌..! కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..?

Team India

Team India-Suryakumar Yadav : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. భార‌త టీ20 తాత్కాలిక కెప్టెన్‌, పొట్టి ఫార్మాట్‌లో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. అంతేకాదండోయ్ అత‌డు దాదాపు రెండు నెల‌ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. చీల మండ‌ల గాయంతో సూర్య‌కుమార్ ఇబ్బంది ప‌డుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమ్ఇండియా ఇటీవ‌ల ముగిసిన టీ20 సిరీస్‌ను 1-1తో స‌మం చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో టీ20లో సూర్య‌కుమార్ యాద‌వ్ శ‌త‌కంతో చెల‌రేగాడు. అయితే.. ఇదే మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ అత‌డు గాయ‌ప‌డ్డాడు. దీంతో సూర్య వెంట‌నే మైదానాన్ని వీడాడు. అత‌డి చీల‌మండ‌ల గాయాన్ని ప‌రిశీలించిన వైద్యులు దాదాపు ఏడు వారాల పాటు అత‌డికి విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు.

Babar Azam : ఆశ‌గా అడిగితే.. మ‌హిళా అభిమాని హృద‌యాన్ని ముక్క‌లు చేసిన బాబ‌ర్ ఆజాం.. వీడియో

Suryakumar Yadav

Suryakumar Yadav

దీంతో అత‌డు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త జ‌ట్టు అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది.

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్ ఎవ‌రు..?

రెగ్యుల‌ర్ కెప్టెన్ అయిన రోహిత్ శ‌ర్మ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 నుంచి ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. దీంతో హార్దిక్ పాండ్య‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే.. అత‌డు ఇటీవ‌ల స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో లీగ్ ద‌శ‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో గాయ‌పడ‌డంతో ఆట‌కు దూరంగా ఉంటున్నాడు. పాండ్య ఫిట్‌నెస్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్డేట్ లేదు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అత‌డు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండ‌డ‌ని తెలుస్తోంది.

పాండ్య గాయ‌ప‌డ‌డంతో అత‌డి స్థానంలో సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20 కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా.. ఇప్పుడు సూర్య సైతం గాయ‌ప‌డ‌డంతో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎవ‌రు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.

Electra Stumps : క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఎలక్ట్రా స్టంప్స్ వినియోగం.. అంపైర్‌లా పనిచేస్తాయట? ఐపీఎల్‌లో వినియోగం ఎప్పుడంటే

ఇదిలా ఉంటే.. జూన్‌లో వెస్టిండీస్‌-యూఎస్ దేశాలు సంయుక్తంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి ముందు టీమ్ఇండియా ఆట‌గాళ్లు గాయ‌ప‌డుతుండ‌డం అభిమానుల‌తో పాటు మేనేజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.