Bangladesh vs India: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను 227 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా

భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు మ్యాచులో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో మొమిన్ హక్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ హక్ 84, షకీబ్ అల్ హసన్ 16, ముస్లఫికర్ రహీం 26, లిట్టోన్ దాస్ 25, మెహిదీ హసన్ 15, నురూల్ హసన్ 6, తాస్కిన్ అహ్మద్ 1, తైజుల్ ఇస్లాం 4, ఖలెద్ అహ్మద్ 0 పరుగులు చేశారు.

Bangladesh vs India: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను 227 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా

Bangladesh vs India

Updated On : December 22, 2022 / 3:57 PM IST

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు మ్యాచులో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో మొమిన్ హక్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ హక్ 84, షకీబ్ అల్ హసన్ 16, ముస్లఫికర్ రహీం 26, లిట్టోన్ దాస్ 25, మెహిదీ హసన్ 15, నురూల్ హసన్ 6, తాస్కిన్ అహ్మద్ 1, తైజుల్ ఇస్లాం 4, ఖలెద్ అహ్మద్ 0 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ నాలుగేసి వికెట్లు తీయగా, జయదేవ్ ఉనాద్కత్ రెండే వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్సులో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 1, శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి టెస్టు మ్యాచు ఓడిపోయిన విషయం తెలిసిందే.

రెండో టెస్టులోనూ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం అవుతుంది. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయింది. టెస్టు మ్యాచుల్లో టిమిండియాపై ఇప్పటివరకు ఒక్క మ్యాచూ గెలిచిన చరిత్ర బంగ్లాదేశ్ కు లేదు.

Netflix Users : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. 2023 నుంచి మీ అకౌంట్ పాస్‌వర్డ్ ఎవరికి షేర్ చేయలేరు.. ఎందుకో తెలుసా?