Border–Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫి; ఆ మూడు తప్పా.. ఆతిథ్య జట్లదే పైచేయి.. ఎందుకో తెలుసా!

Border–Gavaskar Trophy: ఆస్ట్రేలియా బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని దక్కించుని దాదాపు దశాబ్దకాలమయింది. 2014-15లో ఆసీస్ చివరిసారిగా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దక్కించుకుంది.

Border–Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫి; ఆ మూడు తప్పా.. ఆతిథ్య జట్లదే పైచేయి.. ఎందుకో తెలుసా!

Updated On : February 19, 2023 / 5:11 PM IST

Border–Gavaskar Trophy 2023: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని టీమిండియా నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండింటిలో గెలిచి 2-0 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్కటి గెలిచినా లేదా డ్రా చేస్తున్నా భారత్ విజేతగా నిలుస్తుంది. రెండు మ్యాచ్ లు డ్రా అయితే ఇరుజట్లు సంయుక్తంగా ట్రోఫిని దక్కించుకుంటాయి. అయితే ప్రస్తుత టీమిండియా జోరు చూస్తే రోహిత్ సేనకే విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

ఆస్ట్రేలియా బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని దక్కించుని దాదాపు దశాబ్దకాలమయింది. 2014-15లో ఆసీస్ చివరిసారిగా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దక్కించుకుంది. 2017 నుంచి భారత్ వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచింది. తాజా సిరీస్ లోనూ గెలిచి నాలుగోసారి టైటిల్ కొట్టాలని టీమిండియా భావిస్తోంది.

మూడు సార్లు లెక్క తప్పింది..
గణాంకాలను పరిశీలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని ఎక్కువ పర్యాయాలు ఆతిథ్య దేశాలే దక్కించుకున్నాయి. మూడు సందర్భాల్లో మాత్రమే ఈ లెక్క తప్పింది. దానికి కారణం ఆయా సందర్భాల్లో ఆడిన ఆటగాళ్లు తమ పోరాట పటిమతో విజయాల్లో కీలక పాత్ర పోషించమే. 1996 నుంచి ఇప్పటివరకు 15 సిరీస్ లు జరగ్గా 9 పర్యాయాలు భారత్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఒకసారి మాత్రం ఇరు జట్లు సంయుక్త విజేతగా నిలిచాయి.


భారత్ గడ్డపై జరిగిన 2004-05 సిరీస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్, మెక్ గ్రాత్ కారణంగా ఆసీస్ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2018-19 సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, బుమ్రా సత్తా చాటడంతో టీమిండియా విజేతగా నిలిచింది. ఆసీస్ గడ్డపైనే 2020-21లో మరోసారి భారత్ విజయాన్ని అందుకుంది. రహనే, పుజారా, శుభమన్ గిల్, శ్రార్దూల్ టీమిండియాను గెలిపించారు. ప్రస్తుత సిరీస్ లో రవీంద్ర జడేజా కీలకంగా మారాడు.

Also Read: సచిన్ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ.. అత్యంత వేగంగా 25వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు

ఒక్క అడుగు దూరంలో…
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడే అవకాశముంది. ఆసీస్ టీమ్ ఇప్పటికే ఫైనల్లో అడుగు పెట్టగా, టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే ఫైనల్ కు భారత్ అర్హత సాధిస్తుంది. టీమిండియా ఇదేవిధంగా ఆడితే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ తుదిపోరుకు వెళ్లడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.