Champions Trophy 2025 : వార్నీ.. బంగ్లాదేశ్‌తో ఓడిపోతే.. పాకిస్తాన్‌కు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ2025లో గ్రూప్ స్టేజీలో తమ చివరి మ్యాచ్‌లో విజయంతో ముగించాలని పాక్, బంగ్లాదేశ్‌లు కోరుకుంటున్నాయి.

Do you know how loss for Pakistan if the team lost the match against Bangladesh
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలై వారం రోజులు మాత్రమే పూర్తి అయింది. ఈ టోర్నీ మొదలైన ఐదు రోజుల్లోనే పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓటములు ఆ జట్టును గట్టి దెబ్బతీశాయి. ఇక ఆ జట్టు గ్రూప్ స్టేజీలో తన చివరి మ్యాచ్ ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. గురువారం జరగనున్న ఈ మ్యాచ్‌కు రావల్సిండి వేదిక కానుంది. అటు బంగ్లాదేశ్ సైతం ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్కమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది.
అయితే.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కనీసం ప్రైజ్‌మనీ రూపంలో కొంత మొత్తాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంది. లేదంటే కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
Champions Trophy 2025 : కోతులు కూడా అంతగనం తినవు.. వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..
ఎలాగంటే..?
ఐసీసీ వెల్లడించిన వివరాల మేరకు.. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.19.45 కోట్ల ప్రైజ్‌మనీగా దక్కనుంది. ఇక రన్నరప్‌కు రూ.9.72 కోట్లు లభిస్తాయి. అదే విధంగా సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్లకు రూ.4.86 కోట్లు వస్తాయి. ఇక ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న జట్లు రూ.1.21 కోట్లు అందుకోనున్నారు.
పాకిస్తాన్ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కనీసం బంగ్లాదేశ్‌ను అయిన ఓడిస్తే ఆ జట్టు ఐదు లేదా ఆరో స్థానంతో టోర్నీని ముగిస్తుంది. అప్పుడు రూ.3.04 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ పై బంగ్లాదేశ్ గెలిస్తే అప్పుడు పాకిస్తాన్ ఏడు లేదా ఎనిమిదో స్థానంతో టోర్నీని ముగిస్తుంది. అప్పుడు పాక్ రూ.1.22 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు ప్రతి రూపాయి కూడా చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో కనీసం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచి కనీసం ఓ మూడు కోట్లు అయినా లభిస్తే పీసీబీకి కాస్తైనా ఊరట లభిస్తుంది. చూడాలి మరి పాక్ టీమ్ ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో.