సిడ్నీ టెస్టు : పుజారా డబుల్ సెంచరీ మిస్

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 03:26 AM IST
సిడ్నీ టెస్టు : పుజారా డబుల్ సెంచరీ మిస్

సిరీస్‌లో మూడో శతకం నమోదు
మెప్పించిన మయాంక్‌ అగర్వాల్‌
రాహుల్‌, కోహ్లి, రహానె విఫలం 

సిడ్నీ : కొరకరాని కొయ్యగా ఉన్న టీమిండియా బ్యాట్ మెన్ పుజారాను ఎట్టకేలకు కంగారులు అవుట్ చేశారు. క్రీజులో పాతుకపోయి…సెంచరీ బాది…డబుల్ సెంచరీ వైపు దూసుకెళుతున్న పుజారాకు నాథన్ చెక్ పెట్టాడు. 373 బంతులను ఎదుర్కొన్న పుజారా 193 రన్ల వద్ద అవుట్ అయ్యాడు. తొలి రోజు టీమిండియా పై చేయి సాధించింది. మయాంక్ అగర్వాల్ (77) మెప్పించడంతో కంగారులు ఆందోళన చెందారు. రాహుల్ (9) కోహ్లీ (23), రహానే (18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితేనేం తానున్నా అన్నట్లు పుజారా అడ్డుగోడగా నిలిచి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 
తొలి రోజు నుండి ఆసీస్ బౌలర్ల ఓపికను పరిక్షీస్తూ డబుల్ సెంచరీకి పుజారా దగ్గరగా వచ్చాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విహారీ (42) రన్లు సాధించాడు. ప్రస్తుతం పంత్ 53, జడేజా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 134 ఓవర్లలో 6 వికేట్ల నష్టానికి 433 పరుగులు చేసింది.