కామన్వెల్త్ గేమ్స్‌లో 24 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ని చేరుస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 దేశాలకి చెందిన మహిళా క్రికెట్ జట్లు పోటీపడనుండగా.. 1998 తర్వాత కామన్వెల్త్‌లో క్రికెట్ పోటీలు జరగడం ఇదే తొలిసారి.
వాస్తవానికి కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని చేర్చాలని ఎంతోకాలంగా అభిమానులు, క్రికెటర్లు కోరుతున్నారు. కానీ, క్రికెట్‌కి ఉన్న ఆదరణ, ఆధిపత్యం.. మిగిలిన పోటీలపై ప్రభావం చూపవచ్చని భావించిన కమిటీ నిర్వాహకులు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. అయితే ఉమెన్స్ టీ20 క్రికెట్‌ని చేర్చడంపై సుదీర్ఘ చర్చ తర్వాత అంగీకారం లభించింది. 1998లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మెన్స్ క్రికెట్ జరిగింది. ఆ పోటీల్లో దక్షిణాఫ్రికా జట్టు బంగారు పతకం గెలుచుకుంది.
ఫురుషుల క్రికెట్‌కి ఉన్న ఆదరణతో పోలిస్తే..? మహిళల క్రికెట్‌కి ఆదరణ చాలా తక్కువ అయిన క్రమంలో.. టోర్నీలోని మిగిలిన గేమ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని కామన్వెల్త్ నిర్వాహకులు భావించి, మహిళల క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కలిసి సీజీఎఫ్‌తో చర్చలు జరిపి చివరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
క్రికెట్ అభిమానులకు గొప్ప వార్త ఉంది. 2022 లో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా చేర్చబడింది. ఇందుకోసం కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అర్హత ప్రక్రియను ప్రకటించాయి. 2022 లో కామన్వెల్త్ క్రీడలలో ఎనిమిది మహిళా జట్లు పాల్గొంటాయి.
ఈ క్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌లో ఏ ఏ జట్లు అర్హత సాధిస్తాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం కాగా.. ఇంగ్లాండ్ జట్టు నేరుగా ఆతిథ్య జట్టుగా అర్హత సాధించింది.
ఈ విధంగా కామన్వెల్త్ క్రీడల్లో చేరిన మొదటి క్రికెట్ జట్టుగా ఇంగ్లాండ్ మహిళల జట్టు నిలిచింది. ఐసిసి ఉమెన్స్ టి 20 టీం ర్యాంకింగ్ ప్రకారం.. ఏప్రిల్ 1, 2021 నుండి 31 జనవరి 2022. మొత్తం ఎనిమిది దేశాలను కలుపుకొని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో మహిళల క్రికెట్ జట్లు తొలిసారి ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్ హామ్ వేదికగా 2022లో జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.