Asia Cup 2023 : ఆసియాక‌ప్ ప్రారంభానికి ముందు క‌రోనా క‌ల‌క‌లం.. టోర్నీకి కొవిడ్ ముప్పు..?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup) 2023 ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి పాకిస్తాన్‌, శ్రీలంక లు ఆతిథ్యం ఇస్తున్నాయి.

Asia Cup 2023 : ఆసియాక‌ప్ ప్రారంభానికి ముందు క‌రోనా క‌ల‌క‌లం.. టోర్నీకి కొవిడ్ ముప్పు..?

Covid hits Asia Cup

Asia Cup : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup) 2023 ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి పాకిస్తాన్‌, శ్రీలంక లు ఆతిథ్యం ఇస్తున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది అన‌గా ఇప్పుడు క‌రోనా (Covid-19) టెన్ష‌న్ ప‌ట్టుకుంది. శ్రీలంక‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో వారిద్ద‌రిని ఐసోలేష‌న్‌లో ఉంచారు. ఆగ‌స్టు 31 న‌ లంక జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ స‌మ‌యానికి క‌ల్లా కోలుకుని నెగెటివ్‌గా నిర్థార‌ణ అయితేనే వాళ్లు బ‌రిలోకి దిగ‌నున్నారు.

ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఎవ‌రో కాదు అవిష్క ఫెర్నాండో, ఓపెనింగ్ బ్యాటర్ కుశాల్ పెరెరా. ఈ ఇద్ద‌రు ప్ర‌స్తుతం శ్రీలంక వ‌న్డే జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లు. ఇటీవ‌ల నిర్వ‌హించిన లంక ప్రీమియ‌ర్ లీగ్ ముగిసే స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచారు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఆసియా క‌ప్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల‌కు క‌రోనా సోక‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లంక బోర్డుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Frustrated Batter : నన్నే ర‌నౌట్ చేస్తావా.. బ్యాటిచ్చుక్కొట్టిన‌ నాన్ స్ట్రైక‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ఆసియా క‌ప్‌లో భార‌త మ్యాచులు అన్ని శ్రీలంక వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. ఈ టోర్నీ ముగిసిన త‌రువాత భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల గాయాల‌తో ఇబ్బందులు ప‌డుతోంది. ఇప్పుడు కీల‌క ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డి ముఖ్య‌మైన మ్యాచుల‌కు అందుబాటులో లేకుండా పోతే మాత్రం అది జ‌ట్టు ఆట‌తీరు పై ప్ర‌భావాన్ని చూపుతుంది.

గ‌తంలో మాదిరిగా ప్ర‌స్తుతం కరోనా తీవ్ర‌త అంత అధికంగా లేదు. అయిన‌ప్ప‌టికీ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయితే మాత్రం ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందే. బ‌యోబ‌బుల్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం అయితే లేదు గానీ ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు మాత్రం తీసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. గ్రౌండ్లు, డ‌గౌట్ల‌లో శానిటైజేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం అయితే ఉందని అంటున్నారు.

Yuvraj Singh : మ‌రోసారి తండ్రైన యువ‌రాజ్ సింగ్‌.. నిద్రలేని రాత్రులు సంతోషాన్నిస్తున్నాయి

ఆసియా క‌ప్ ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ సారి వ‌న్డే ఫార్మాట్‌లో టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. 13 మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌గా పాకిస్తాన్ 4, శ్రీలంక తొమ్మిది మ్యాచుల‌కు ఆతిథ్యం ఇస్తాయి. ఆరు జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూపులో ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. ఆయా గ్రూపుల్లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ 4 ద‌శ‌కు చేరుకుంటాయి. అక్క‌డ ఒక్కొ జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో మ్యాచులు ఆడుతుంది. టాప్ -2గా ఉన్న జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్

ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక‌ ముల్తాన్

ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక‌ క్యాండీ

World Cup 2023 Tickets : టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులు.. సైట్ క్రాష్‌.. మున్ముందు క‌ష్టాలేనా..!

సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక‌ కొలంబో