Cristiano Ronaldo : యూట్యూబ్‌లో రొనాల్డో సంచలనం.. 90 నిమిషాల్లోనే మిలియన్..
ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారు అంటూ దాదాపుగా ఉండరు.

Cristiano Ronaldo gathers 10 million subscribers in just 90 minutes
Cristiano Ronaldo joins YouTube : ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారు అంటూ దాదాపుగా ఉండరు. ఈ పోర్చుగల్ ఆటగాడు ఎట్టకేలకు యూట్యూబ్‌లో అడుగుపెట్టాడు. ఇలా యూట్యూబ్‌లో అడుగుపెట్టాడో లేదో అలా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం (ఆగస్టు 21) క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌ని ప్రారంభించాడు. కేవలం 90 నిమిషాల్లోనే 1 మిలియన్ (10లక్షలు) మంది సబ్‌స్ర్కైబర్‌లను సాధించాడు. అంతేకాదండోయ్ ప్రారంభించిన సగం రోజు వ్యవధిలోనే 13 మిలియన్లు దాటేసింది. ఇప్పటి వరకు 19 వీడియోలను అతడు పోస్ట్ చేశాడు.
మాజీ రియల్ మాడ్రిడ్ స్టార్ కోసం అభిమానులు.. అతని ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందడానికి, తెరవెనుక అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంతో ఒక్కొ వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. తన యూట్యూబ్ ఛానెల్ విషయాన్ని అతడు తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించాడు. ‘వెయిటింగ్ ముగిసింది.. నా యూట్యూబ్ ఛానల్ ఇదిగో. అందరూ సబ్‌స్ర్కైబ్ చేసుకోండి. ఈ కొత్త ప్రయాణంలో మీరందరూ చేరండి.’ అంటూ రొనాల్డొ రాసుకొచ్చాడు.
ఇక రొనాల్డోకు ఎక్స్ (గతంలో ట్విట్టర్) 112.5 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లోనూ అతడు దూసుకుపోతున్నాడు.
View this post on Instagram