Cristiano Ronaldo: ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ రొనాల్డో

స్టేడియంలో జింకలా పరుగులు పెడుతూ.. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను ఏమారుస్తూ గోల్స్ కొట్టేస్తాడు. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Cristiano Ronaldo: ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ రొనాల్డో

Christian Ronaldo

Updated On : September 2, 2021 / 1:12 PM IST

Cristiano Ronaldo: గోల్స్ చేయడంలో రొనాల్డో స్టైల్ సపరేట్. కాళ్లలో కదలికలు.. బాల్‌ను చేతులతోనైనా అంతలా హ్యాండిల్ చేయలేరేమో! స్టేడియంలో జింకలా పరుగులు పెడుతూ.. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను ఏమారుస్తూ గోల్స్ కొట్టేస్తాడు. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

మొత్తంగా 111 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌లో ఈ పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్ రెండు గోల్స్‌ కొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2-1 తేడాతో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 89వ నిమిషంలో రొనాల్డొ 110వ గోల్‌ నమోదు చేసి ఇరాన్‌ మాజీ స్ట్రైకర్‌ అలీ దేయి (109)ని అధిగమించాడు.

మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రెండో హెడర్‌తో 111వ గోల్‌ అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా చరిత్ర లిఖించాడు. 180 మ్యాచులు ఆడి రొనాల్డొ ఈ రికార్డును సాధించాడు.

‘నాకెంతో సంతోషంగా ఉంది. కేవలం ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినందుకే కాదు. మేమంతా కలిసి ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించాం. ఆట చివర్లో రెండు గోల్స్‌ చేయడం తేలిక కాదు. అందుకే జట్టు కష్టపడ్డ తీరును అభినందిస్తున్నా. ఆఖరి వరకు గెలుస్తామనే నమ్మాం’ అని రొనాల్డొ అన్నాడు.