IPL 2023, CSK vs SRH: చెన్నైతో సన్‌రైజర్స్‌కు తిప్పలు తప్పవా..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా నేడు మరో సమరానికి రంగం సిద్దమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

CSK vs SRH
IPL 2023, CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా నేడు మరో సమరానికి రంగం సిద్దమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. మూడు మ్యాచుల్లో విజయం సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా రెండు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో స్థానాలను మెరుగుపరచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
నటరాజన్‌కు నో ఛాన్స్.!
ఈ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటములతో ఆరంభించింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినప్పటికి ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి మంచి ఊపులో కనిపించింది. అయితే.. ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకూడదని భావిస్తోంది. ముంబైతో ఆడిన జట్టులో ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఆ మ్యాచులో ధారాళంగా పరుగులు ఇచ్చిన నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు ఇవ్వాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మేంట్ నిర్ణయం తీసుకుంది.
ఫిట్‌నెస్ సాధించిన బెన్ స్టోక్స్
గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లలో అదరగొడుతున్నాడు. దీంతో నేటి మ్యాచులో అతడు ఆడడం దాదాపుగా ఖాయమైంది. అతడి చేరికతో చెన్నై జట్టుకు సమతూకం ఏర్పడనుంది. అయితే.. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ తీవ్రంగా నిరాశపరిచాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడు విజృంభించాలని చెన్నై మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది.డ్వైన్ ప్రిటోరియస్ స్థానంలో స్టోక్స్‌ను ఆడించొచ్చు.
IPL 2023, SRH vs MI: ఉప్పల్‌లో అదరగొట్టిన రోహిత్ సేన.. హ్యాట్రిక్ విజయాలు
హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 18 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 13 సార్లు చెన్నై విజయం సాధించగా, 5 మ్యాచుల్లో హైదరాబాద్ గెలుపొందింది. హైదరాబాద్ పై చెన్నై అత్యధిక స్కోరు 223 కాగా.. సీఎస్‌కే పై ఎస్ఆర్‌హెచ్ అత్యధిక స్కోరు 192.
ఫిట్‌నెస్ సాధించిన
సాధారణంగా చెపాక్‌లోని పిచ్ బ్యాటింగ్ అనుకూలం. మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు సహకారం ఉంటుంది. ఈ పిచ్ పై తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 164. ఈ మైదానంలో ఛేజింగ్ చేసిన జట్లు అత్యధిక సార్లు విజయం సాధించాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేధనకే మొగ్గు చూపవచ్చు.
తుది జట్ల (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, మహేశ్, మహేశ్ పతిరానా/మిచెల్ సాంట్నర్, ఆకాష్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ : హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్/అకేల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ