CSKvKKR: ఒక్క మగాడు.. చెన్నై టార్గెట్ 109

CSKvKKR: ఒక్క మగాడు.. చెన్నై టార్గెట్ 109

Updated On : April 9, 2019 / 4:11 PM IST

చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన భీకరపోరులో కోల్ కతా చితికిపోయింది. చెన్నై బౌలర్లు ఘోరంగా మ్యాచ్ ను తిప్పేశారు. ఈ క్రమంలో చెన్నైకు 109 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు.

ఆరంభం నుంచి చెన్నై ఘోరంగా కట్టడి చేయడంతో ఏడుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కేవలం ఆండ్రీ రస్సెల్(50), రాబిన్ ఊతప్ప(11), దినేశ్ కార్తీక్(19) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. 

క్రిస్ లిన్(0), సునీల్ నరైన్(6), నితీశ్ రానా(0), శుభ్ మాన్ గిల్(9),  పీయూశ్ చావ్లా(8), కుల్దీప్ యాదవ్(0), ప్రసిద్ధ్ కృష్ణ(0), హ్యారీ గర్నే(1)లు చిత్తుగా ఓటమికి గురైయ్యారు.