CSKvKKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

CSKvKKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

Updated On : April 9, 2019 / 1:56 PM IST

ఐపీఎల్ లో మరో  రసవత్తరమైన పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. లీగ్ ఆరంభం నుంచి సమాన ఫలితాలు అందుకుని తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇరు జట్ల కెప్టెన్లే వికెట్ కీపర్లుగా ఆడుతున్న ఈ మ్యాచ్‌లో బలాబలాలు సమంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా జట్టులో ప్లేయర్లు కొద్దిపాటి హిట్టర్లు కనిపిస్తున్నా.. చెన్నైలో అంతే ధీటైన అనుభవం పోటీనివ్వనుంది. 
Read Also : సూపర్ కింగ్స్ చేతికి అడ్డంగా దొరికిన జడేజా