KKR Vs SRH : డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ

కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. నిషేధం తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. 47 పరుగుల దగ్గర భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో వార్నర్ కు ఇది 37వ అర్ధశతకం. టాస్ గెలిచిన కోల్ కతా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
దినేష్ కార్తీక్ కెప్టెన్సీ లో కోల్ కతా, భువనేశ్వర్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగాయి. 2016 లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ 2 జట్ల మధ్య 15 మ్యాచ్ లు జరగ్గా.. కోల్ కతాదే పైచేయి. కోల్ కతా 9 మ్యాచ్ లు గెలవగా సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు గెలిచింది.