David Warner Dance : వారెవ్వా.. వార్నర్ అదరగొట్టేశావ్..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు భారతీయులంటే చాలా అభిమానం.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్ మరింత దగ్గరయ్యాడు.

David Warner Dance
David Warner Dance: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు భారతీయులంటే చాలా అభిమానం.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్ మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు.. భారత్ పై అభిమానాన్ని చాటుకునేందుకు ఏదో రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఉన్నాడు.
పాటలు, డాన్సులు, వీడియోలతో అలరిస్తూ వార్నర్ ఆకట్టుకుంటున్నాడు. స్వాప్ వీడియోతో ముందుకు వచ్చిన వార్నర్ టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలోని ఓ పాటకు డాన్సు అదరగొట్టేశాడు. స్వాపింగ్ యాప్‌తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఇదంతా తన ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతోనే చేశానంటూ వార్నర్ క్యాప్షన్ పెట్టాడు. వార్నర్ పోస్టు చేసిన ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐపీఎల్ 14వ సీజన్ కరోనా దెబ్బకు రద్దు కావడంతో స్వదేశానికి వార్నర్ వెళ్లిపోయాడు. సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్‌లో 15 రోజులు గడిపాడు.
View this post on Instagram
ఐసోలేషన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఆస్ట్రేలియా జూలైలో విండీస్‌లో పర్యటించనుంది. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేలు ఆడనుంది. వార్నర్ Hook Up Song పాటకు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.