IPL 2021 : అయ్యర్ వాట్ ఏ సిక్స్, వీడియో వైరల్

శ్రేయాస్ అయ్యర్ కొట్టిన సిక్సర్ క్రీడాభిమానులను అలరిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా అయ్యర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు.

IPL 2021 : అయ్యర్ వాట్ ఏ సిక్స్, వీడియో వైరల్

Six

Updated On : August 18, 2021 / 10:32 AM IST

DC’s Shreyas Iyer : క్రికెట్ లో బ్యాట్స్ మెన్స్ చేసే విన్యాసాలు అదరగొడుతుంటాయి. వినూత్నంగా కొట్టే షాట్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయనే విషయం తెలిసిందే. తాజాగా..టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కొట్టిన సిక్సర్ క్రీడాభిమానులను అలరిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా అయ్యర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేయగా..సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు శ్రేయాస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..అయ్యర్ భుజానికి గాయం కావడంతో..ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఇతనిస్థానంలో రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు.

Read More : Jeff Bezos vs NASA : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నాసాపై ఎందుకు దావా వేశారంటే?

ఐపీఎల్ 2021 పోటీలకు ఇతను సిద్ధమౌతున్నాడు. అందులో భాగంగా..యూఏఈలో ఉన్న అయ్యర్ దుబాయి లోని ఐసీసీ (ICC) అకాడమీ మైదానంలో ప్రాక్టిస్ చేస్తున్నాడు. ప్రాక్టిస్ సమయంలో..బౌలర్ వేసిన బంతిని అతను సిక్సర్ గా మలిచాడు. నేరుగా కొట్టిన షాట్ కు బంతి స్టేడియం అవతల పడింది.

Read More : TS ECET : ఈసెట్ ఫలితాలు విడుదల..24 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్

ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఆడిన 8 మ్యాచ్ ల్లో ఆరింట విజయం సాధించి…2 ఓటములు చెందింది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ (IPL) సీజన్ వాయిదా పడింది. లీగ్ లో రెండో అంచె పోటీలు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.