DCvsMI: ఢిల్లీ టార్గెట్ 169

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.

DCvsMI: ఢిల్లీ టార్గెట్ 169

Updated On : April 18, 2019 / 4:27 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన రోహిత్ శర్మ(30) 6.1 ఓవర్ల వద్ద మిశ్రా బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డికాక్(35)పరుగులు చేసి రనౌట్ గా ముగించాడు. బెన్ కట్టింగ్(2)పరుగులతో నిరాశపర్చగా సూర్య కుమార్ యాదవ్(26) 15.1ఓవర్ల వరకూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి రబాడ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత కృనాల్(37)తో కలిసి హార్దిక్ పాండ్యా(32)చెలరేగడంతో జట్టు స్కోరు 168 పరుగులకు చేరింది. 20ఓవర్లు పూర్తవడానికి ఇంకా 3 బంతుల ముందే హార్దిక్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ సున్నా పరుగులకే పరిమితమైయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడ 2వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీయగలిగారు.