Team India: జనవరిలో టీమిండియా ఎన్ని టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడుతుందో తెలుసా? షెడ్యూల్ ఇలా..
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి.

Team India
Team India: 2023 సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. 2023 సంవత్సరం టీమిండియాకు కీలకమైన ఏడాది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తోపాటు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్ జరగనున్నాయి. మెగా టోర్నీలతో పాటు స్వదేశంలో, విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమిండియా ఆటగాళ్లు బిజీబిజీగా గడపనున్నారు.
India vs Bangladesh: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి. జనవరి 3 నుంచి జనవరి 15వరకు శ్రీలంక జట్టుతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. వాటిలో తొలి టీ20 మ్యాచ్ జనవరి 3న ( ముంబయి) జరుగుతుంది. రెండో టీ20 మ్యాచ్ జనవరి 5న ( పుణె ) జరుగుతుంది. మూడో టీ20 మ్యాచ్ జనవరి 7 ( రాజ్‌కోట్) జరుగుతుంది. ఇక వన్డే సిరీస్‌లో భాగంగా.. శ్రీలంక వర్సెస్ భారత్ తొలి వన్డే మ్యాచ్ జనవరి 10న (గుహవాటి) జరుగుతుంది. రెండో వన్డే జనవరి 12న (కోల్‌కతా) జరగనుండగా, మూడో వన్డే జనవరి 15న (తిరువనంతపురం) జరుగుతుంది.
india vs bangladesh test Match: టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా .. ఫొటో గ్యాలరీ
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో భారత్ మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. తొలుత వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. తొలి వన్డే జనవరి 18న (హైదరాబాద్), రెండో వన్డే జనవరి 21న (రాయ్‌పూర్), మూడో వన్డే జనవరి 24న ( ఇండోర్) జరుగుతుంది. ఆ తరువాత మూడు టీ20 మ్యాచ్‌లు న్యూజిలాండ్ తో భారత్ ఆడుతుంది. తొలి టీ20 మ్యాచ్ జనవరి 27న (రాంచీ), రెండో టీ20 మ్యాచ్ 29న (లఖ్‌నవూ), మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న (అహ్మదాబాద్) జరుగుతుంది. జనవరి నెలలో మొత్తం 11 రోజులు మ్యాచ్ లు జరగనున్నాయి.