ENG vs IND 1st Test : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. సాయి సుదర్శన్ అరంగ్రేటం.. తెలుగోడికి నో ఛాన్స్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది.

ENG vs IND 1st Test England win the toss and opt to bowl
భారత్, ఇంగ్లాండ్ జట్ల ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. వాతావరణం మబ్బులు పట్టి ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు అంత సులువు కాదు.
‘మేము బౌలింగ్ చేస్తాము. హేడింగ్లీ అద్భుతమైన మైదానం. ఇక్కడ చాలా మంచి క్రికెట్ ఆడాము. వాతావరణ పరిస్థితులు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాము.’ అని బెన్‌స్టోక్స్ తెలిపాడు.
‘మేము కూడా బౌలింగ్ తీసుకోవాలని అనుకున్నాము. మబ్బు పట్టిన వాతావరణం ఉండడంతో తొలి సెషన్ ఎంతో కీలకం కానుంది. సూర్యుడు బయటి వచ్చిన తరువాత కండిషన్స్ మారిపోతాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్‌గా ఉంది. ఈ సిరీస్ కోసం చాలా బాగా ప్రిపేర్ అయ్యాం. సాయి సుదర్శన్ టెస్టు అరంగ్రేటం చేస్తున్నాడు. అతడు నంబర్ 3 స్థానంలో ఆడుతాడు. కరుణ్ నాయర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.’ అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
Rohit Sharma : ఓ వైపు భారత్ ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. మరోవైపు రోహిత్ శర్మ ఎంచక్కా..
భారత తుది జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
#TeamIndia‘s Playing XI for the 1st Test 🙌
Sai Sudharsan makes his Test Debut 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/r4UkgH2pZ4
— BCCI (@BCCI) June 20, 2025
ఇంగ్లాండ్ తుదిజట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
Vitality T20 Blast : ఇదెక్కడి వింతరా బాబు.. ఎండ కారణంగా మ్యాచ్ ఆగిపోయిందా!
నితీశ్‌కుమార్ రెడ్డికి దక్కని చోటు..
ఆస్ట్రేలియా పర్యటనలో చాలా చక్కటి ప్రదర్శన చేసినప్పటికి తొలి టెస్టు మ్యాచ్ తుది జట్టులో తెలుగు కుర్రాడు, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్‌కే జట్టు మేనేజ్‌మెంట్ ఓటు వేసింది.