IND vs ENG : విజృంభించిన బౌలర్లు.. జోస్ బట్లర్, జాకబ్ బెథెల్ హాఫ్ సెంచరీలు.. భారత లక్ష్యం ఎంతంటే?
భారత బౌలర్లు విజృంభించడంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

pic credit @ BCCI
టీమ్ఇండియా బౌలర్లు రాణించడంతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ముందు ఇంగ్లాండ్ ఓ మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (52; 67 బంతుల్లో 4 ఫోర్లు), జాకబ్ బెథెల్ (51; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు.
ఫిలిప్ సాల్ట్ (43; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (32; 29 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. హ్యారీ బ్రూక్ (0), జో రూట్ (19), లిమాయ్ లివింగ్ స్టోన్ (5) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Innings Break!
England are all out for 2⃣4⃣8⃣
3⃣ wickets each for Harshit Rana & Ravindra Jadeja 👌
A wicket each for Axar Patel, Mohd. Shami and Kuldeep Yadav ☝️
Stay tuned for #TeamIndia‘s chase ⏳
Scorecard ▶️ https://t.co/lWBc7oPRcd#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/eIu9Jid3I2
— BCCI (@BCCI) February 6, 2025
టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భావించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్‌లు భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఫిలిప్ అయితే.. బంతి పడడమే ఆలస్యం బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే స్కోరు 50 పరుగులు దాటింది. అయితే.. దాటిగా ఆడుతున్న ఫిలిప్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుత త్రో విసిరాడు. ఫిలిప్, బకెట్ జోడి తొలి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ఈ దశలో అరంగ్రేట బౌలర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో మరో ఓపెనర్ బెన్‌డకెట్ తో పాటు హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడు. దీంతో 77 పరుగులకే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను సీనియర్ ఆటగాళ్లు జో రూట్‌తో పాటు బట్లర్ లు భుజాన వేసుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. కుదుకుంటున్న జోరూట్‌ను రవీంద్ర జడేజా ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా ఈ జోడిని విడదీశాడు.
ఓ ఎండ్‌లో కుదురుకున్న బట్లర్‌కు జాకబ్ బెథెల్ జత కలిశాడు. ఈ జోడి తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. క్రమంగా వేగం పెంచింది. ఈ క్రమంలో వన్డేల్లో 27 వ హాఫ్ సెంచరీని బట్లర్ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కాసేపటికే అతడు అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం బెథెల్ సైతం ఎనిమిదో వికెట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు.