Eng Vs Ind: హాఫ్ సెంచరీలతో రాణించిన సుదర్శన్, జైస్వాల్.. తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..
సాయి సుదర్శన్ 151 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 7 ఫోర్లు కొట్టాడు.

Eng Vs Ind: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ (19), రవీంద్ర జడేజా (19) క్రీజులో ఉన్నారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
జైస్వాల్ 107 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. 10 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సాయి సుదర్శన్ 151 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 7 ఫోర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్ 98 బంతుల్లో 46 పరుగులతో రాణించాడు. రిషబ్ పంత్ 48 బంతుల్లో 37 రన్స్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలికి బంతి బలంగా తగిలి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీశారు.