Joe Root Record : 31 ఏళ్ల వయసులో జో రూట్ అరుదైన రికార్డ్

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. (Joe Root Record)

Joe Root Record : 31 ఏళ్ల వయసులో జో రూట్ అరుదైన రికార్డ్

Joe Root Record

Updated On : June 5, 2022 / 11:26 PM IST

Joe Root Record : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో తక్కువ వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ రికార్డ్ ను సమం చేశాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఇద్దరు(కుక్, రూట్) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.

Joe Root

Joe Root

లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో రూట్ అదరగొట్టాడు. సెంచరీతో(115*) కదంతొక్కాడు. రూట్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, రూట్ సమయోచితంగా ఆడి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రూట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.(Joe Root Record)

IPL 2022: “నాకు ఇండియాలో శాపం తగిలిందనుకుంటున్నా”


అయితే 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి కుక్ కు 229 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, రూట్ 218 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వరల్డ్ వైడ్ గా చూస్తే 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 14వ వాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 10వ వాడు.

Root

Root

ENG vs IND : ఆ ఇద్దరి ఆటగాళ్ల తొలగింపుపై ఆసీస్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్!

కాగా, టెస్ట్ కెరీర్ లో జో రూట్ కి ఇది 26వ సెంచరీ. రూట్.. 170 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 12 బౌండరీలు ఉన్నాయి. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. మొత్తం 118 టెస్టులు ఆడిన రూట్.. 10వేల 015 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్సింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

టెస్ట్ క్రికెట్ లో 10వేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే..

1. Sachin Tendulkar (India) – 15,921

2. Ricky Ponting (Australia) – 13,378

3. Jacques Kallis (South Africa) – 13,289

4. Rahul Dravid (India) – 13,288

5. Alastair Cook (England) – 12,472

6. Kumar Sangakkara (Sri Lanka) – 12,400

7. Brian Lara (West Indies) – 11,953

8. Shivnarine Chanderpaul (West Indies) – 11,867

9. Mahela Jayawardene (Sri Lanka) – 11,814

10. Allan Border (Australia) – 11,174

11. Steve Waugh (Australia) – 10,927

12. Sunil Gavaskar (India) – 10,122

13. Younis Khan (Pakistan) – 10,099

14. Joe Root (England) – 10,015*