ధోనీ.. మ్యాచ్ గెలిచి క్రెడిట్ వాళ్లకిచ్చేశాడు

ధోనీ.. మ్యాచ్ గెలిచి క్రెడిట్ వాళ్లకిచ్చేశాడు

Updated On : May 11, 2019 / 8:58 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టును గెలిపించి క్రెడిట్ మాత్రం తాను తీసుకోలేదు. ‘ఇటువంటి కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించామంటే ముమ్మాటికి బౌలర్ల గొప్పదనమే’ అని కొనియాడాడు. 

‘వికెట్లు పడగొట్టడమే చాలా కీలకాంశం. బౌలర్లకే క్రెడిట్ దక్కాలి. ఒక కెప్టెన్‌గా నాకు ఇదే కావాలి. చక్కగా బౌలింగ్ చేసి ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టేశారు. సీజన్‌లో ఈ దశకు చేరుకున్నామంటే బౌలింగ్ విభాగం గొప్పదనమే. థ్యాంక్స్’  అని మ్యాచ్ అనంతరం మీడియాతో ధోనీ తెలిపాడు. 

మే 10శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 9వికెట్లు నష్టపోయి 148పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చేధనకు దిగిన చెన్నై ఓపెనర్లు చెరో హాఫ్ సెంచరీతో శుభారంభం చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ లాంచనాన్ని పూర్తి చేసి జట్టుకు విజయం అందించారు.