గణాంకాలివే: ముంబైతో చెన్నై 4సార్లు ఫైనల్‌కి
వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో ఫైనల్.

వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో ఫైనల్.
వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో ఫైనల్. తొలి సారి 2010లో చెన్నై.. ముంబై జట్ల మధ్య తొలి ఫైనల్ పోరు జరగగా చెన్నై 22పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కుంచుకుంది.
ఆ తర్వాత 2013, 2015లలో తలపడిన ఇరు జట్లు 2019లో మరోసారి ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో గణాంకాలను పరిశీలిస్తే..
బ్యాటింగ్ పర్‌ఫార్మాన్స్:
2015లో ముంబై ఇండియన్స్ 202/5తో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
2013లో చెన్నై సూపర్ కింగ్స్ 125/9తో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ 123పరుగులతో టాప్ స్కోర్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
2015 సీజన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 68పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా లెండి సిమోన్స్ ఘనత సాధించాడు.
ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్స్‌లో 6హాఫ్ సెంచరీలు, 40సిక్సులు నమోదు అయ్యాయి.
కీరన్ పొలార్డ్ ఒక్కడే 8సిక్సులు, 12 ఫోర్లు కొట్టిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
బౌలింగ్ పర్‌ఫార్మాన్స్:
ఇరు జట్ల మధ్య ఫైనల్లో డేన్ బ్రావో 6వికెట్లు తీశాడు.
2013సీజన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రావో 4/42స్కోరు నమోదు చేశాడు.
కీపింగ్, ఫీల్డింగ్ పర్‌ఫార్మాన్స్:
ఎంఎస్ ధోనీ కీపింగ్‌లోనే 3వికెట్లు పడగొట్టి అత్యధిక సార్లు కీపర్‌గా అవుట్ చేసిన ఘనత సాధించాడు. ఫీల్డింగ్ విషయానికొస్తే సురేశ్ రైనా 3క్యాచ్‌లతో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా ఘనత సాధించాడు.