RCB ఫర్ సేల్.. అమ్మేయడం డిసైడైపోయింది.. వెలుగులోకి సంచలనం.. ప్రకటించింది ఎవరో కాదు..
మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు అమ్మకం పైన సంచలన పోస్ట్ పెట్టారు.

RCB
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు 2025 సంవత్సరం ఆనందాన్ని నింపినప్పటికీ.. అదే స్థాయిలో విషాదాన్ని కలిగించింది. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు అదరగొట్టింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆర్సీబీ ట్రోఫీని గెలవలేదు.. ఆ జట్టు తొలిసారి ఈ ఏడాది ఐపీఎల్ -2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సమయంలో ఆ జట్టు ఓ పెద్ద విషాద ఘటనను ఎదుర్కొంది.
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన తరువాత బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకొని 11మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఆ జట్టు యాజమాన్యం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆర్సీబీ ప్రాంచైజీని విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమైందని తెలుస్తోంది.
Also Read: Team India : పాక్ మీద గెలిచిన ఆనందంలో ఉన్న ఇండియాకి భారీ షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..
ఆర్సీబీ యాజమాన్యం తమ బ్యాలెన్స్ షీట్ నుంచి ప్రాంచైజీని తొలగించడంపై తుది నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేశారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ పూర్తయ్యాయని, కొనేవారు ఉంటే కచ్చితంగా ఆ ప్రాంచైజీ ఓనర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పోస్టు పెట్టారు.
లలిత్ మోదీ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆర్సీబీ ప్రాంచైజీ అమ్మకం గురించి గతంలో అనేకసార్లు పుకార్లు వచ్చాయి.. వాటిని యాజమాన్యం ఖండించింది. కానీ, ప్రస్తుతం యాజమానులు ఆర్సీబీ జట్టు విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే డాక్యుమెంట్స్ పూర్తయ్యాయి. గత సీజన్ల్లో ఐపీఎల్ టోర్నీ గెలిచిన తరువాత ..ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో బలమైన జట్టుగా ఉంది. దీనికంటే మంచి పెట్టుబడి అవకాశం మరొకటి లేదు. దీన్ని ఉపయోగించుకోగలిగిన ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు. ఇది ఖచ్చితంగా కొత్త రికార్డు విలువను సృష్టిస్తుంది అని చెప్పుకొచ్చారు.
There have been a lot of rumour about the sale of an @IPL franchise specifically @RCBTweets – well in the past they have been denied. But it seems the owners have finally decided to take it off their balance sheet and sell it. I am sure having won the IPL last season and also… pic.twitter.com/ecXfU5n5v5
— Lalit Kumar Modi (@LalitKModi) September 29, 2025