ధోనీ భవిష్యత్తుపై గంగూలీ నిర్ణయం: వారికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు

  • Published By: vamsi ,Published On : October 23, 2019 / 06:56 AM IST
ధోనీ భవిష్యత్తుపై గంగూలీ నిర్ణయం: వారికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు

Updated On : October 23, 2019 / 6:56 AM IST

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ప్రెసిడెంట్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిసింది. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి ఇక తప్పుకుంది.

ఈ క్రమంలో సీఓఏ కమిటీ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ తమ పదవీ కాలానికి గాను ఒక్కొక్కరు రూ. 3.5 కోట్లు పొందనున్నారు. ఈ మేరకు వారికి డబ్బును చెల్లించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే అధ్యక్ష పదవి చేపట్టాక మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్ భవిష్యత్‌ గురించి అతడితో, సెలక్టర్లతో మాట్లాడేందుకు ముందుంటానని గంగూలీ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో గంగూలీ ఎంట్రీ ఇవ్వడంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

క్రికెట్ ఇండియాకు సేవలు అందించిన అనుభవం కూడా ఉండడంతో గంగూలీకి క్రికెట్ ఆటగాళ్ల ఆటతీరుపై పట్టుంది. ఈ క్రమంలోనే కోహ్లీ సేనపై కీలక నిర్ణయాలు గంగూలీ తీసుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో ఓడిన తర్వాత టీమిండియా ఇప్పటివరకు ప్రతీ సిరస్ గెలుస్తూనే ఉంది. వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ రెండు సిరీస్‌లలో ధోనీ ఆడలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ పగ్గాలు అందుకున్న గంగూలీ ధోనీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఆసక్తకరంగా ఉంది.