IPL 2023, KKR Vs GT: విజయ్ శంకర్ విధ్వంసం, మిల్లర్ మెరుపులు.. కోల్‌కతాపై గుజరాత్ ఘన విజయం
కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

gt won
IPL 2023, KKR Vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్(51 నాటౌట్; 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకం బాదగా శుభ్‌మన్ గిల్(49; 35 బంతుల్లో 8 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. డేవిడ్ మిల్లర్(32 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్, నరైన్‌లు ఒక్కొ వికెట్ తీశారు.
IPL 2023, KKR Vs GT: కోల్‌కతాపై గుజరాత్ విజయం
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో రహమనుల్లా గుర్బాజ్( 81; 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా ఆఖర్లో ఆండ్రీ రస్సెల్(34; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా జాషువా లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 54 పరుగులు ఇవ్వడం గమనార్హం.