ఐపీఎల్‌లో 4వ క్రికెటర్‌గా భజ్జీ రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌లో 150వికెట్లు తీసిన నాల్గో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 16వ ఓవర్లో రూథర్‌ఫర్డ్ వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 150వ వికెట్ పూర్తి చేసుకున్నాడు.
150వికెట్లు పడగొట్టిన వారిలో శ్రీలంక లెజెండ్ ముంబై ఇండియన్స్ ఫేసర్ లసిత్ మలింగ ఐపీఎల్‌లో అధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 121 మ్యాచ్‌లలో 169వికెట్లు తీసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే వరుసలో అమిత్ మిశ్రా 156 వికెట్లతో రెండో ప్లేయర్‌గా నిలిచాడు. కేకేఆర్ పీయూశ్ చావ్లా మూడో బౌలర్‌గా నిలవగా భజ్జీ నాల్గో ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
ఈ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అధిక వికెట్లు పడగొట్టాను. చెన్నైకు ఆడటం వల్లనే ఇది సాధ్యమైంది. పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు సాధించగలడం ఆనందంగా ఉంది. ధోనీ పవర్ల ప్లేలో ఆడి వికెట్లు త్వరగా పడగొట్టమని చెబుతుంటాడు’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. భజ్జీ తన ఐపీఎల్ కెరీర్లో 2013 సీజన్లో బెస్ట్‌గా 24వికెట్లు తీయగలిగాడు.
150 wickets in #VIVOIPL for @harbhajan_singh ??#CSKvDC pic.twitter.com/Qne0mUe2ce
— IndianPremierLeague (@IPL) May 10, 2019