Haris Rauf : బీబీఎల్‌లో ఫన్నీ ఇన్సిడెంట్‌.. హెల్మెట్‌, గ్లౌవ్స్‌, ప్యాడ్స్ లేకుండానే బ్యాటింగ్‌కు వ‌చ్చిన హారిస్ రవూఫ్.. వీడియో వైర‌ల్‌

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లో ఓ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Haris Rauf : బీబీఎల్‌లో ఫన్నీ ఇన్సిడెంట్‌.. హెల్మెట్‌, గ్లౌవ్స్‌, ప్యాడ్స్ లేకుండానే బ్యాటింగ్‌కు వ‌చ్చిన హారిస్ రవూఫ్.. వీడియో వైర‌ల్‌

Haris Rauf rushes out to bat without pads

Haris Rauf rushes out to bat without pads : జెంటిల్ మ‌న్ గేమ్ క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లో ఓ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బ్యాట‌ర్ త‌ల‌కు హెల్మెట్‌, చేతుల‌కు గ్లౌవ్స్‌, కాళ్ల‌కు ప్యాడ్లు క‌ట్టుకోకుండానే బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అత‌డు ఏమ‌న్నా గ‌ల్లీ క్రికెట‌ర‌గా అంటే కానే కాదు.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చాలా కాలంగా ఆడుతున్న ఆట‌గాడే. అత‌డు ఎవ‌రో కాదు పాకిస్తాన్ ఆట‌గాడు హారిస్ రవూఫ్.

బీబీఎల్ సీజ‌న్ 2023-24లో భాగంగా శ‌నివారం మెల్‌బోర్న్ స్టార్స్‌, సిడ్నీ థండ‌ర్‌ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. పాకిస్తాన్ ఆట‌గాడు హారిస్ రవూఫ్ మెల్‌బోర్న్ స్టార్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ మ్యాచులో మెల్‌బోర్న్ స్టార్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఓ స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ చివ‌రి ఓవర్ స‌మ‌యానికి మెల్‌బోర్న్ స్టార్స్ ఆరు వికెట్లు కోల్పోయింది.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌కు కొత్త త‌ల‌నొప్పి..! మ‌ళ్లీ రోహిత్‌ను బతిమిలాడుకోవాల్సిందేనా?

క్రీజులో అప్ప‌టికే నిల‌దొక్కుకున్న బ్యాట‌ర్లు ఉండడం, మ‌రో ముగ్గురు త‌న కంటే ముందు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉండ‌డంతో హారిస్ రవూఫ్ త‌నకు బ్యాటింగ్ రాద‌ని బావించాడు. అందుక‌నే బ్యాటింగ్‌కు సిద్ధం కాలేదు. అయితే.. అనూహ్యంగా ఆఖ‌రి ఓవ‌ర్‌లో స్టార్స్ మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో 11వ స్థానంలో హారిస్ రవూఫ్ బ్యాటింగ్‌కు రాక త‌ప్ప‌నిస‌రి నెల‌కొంది. బ్యాటింగ్‌కు సిద్ధంగా లేని హారిస్ రవూఫ్ హెల్మెట్‌, గ్లౌవ్స్, బ్యాట్‌ను చేతుల‌తో ప‌ట్టుకుని ప‌రిగెత్తుకుంటూ క్రీజు వ‌ద్ద‌కు వ‌చ్చాడు.

టైమ్డ్ ఔట్ నిబంధ‌న నుంచి త‌ప్పించుకునేందుకే అత‌డు ఇలా చేశాడు. క్రీజులోకి వ‌చ్చిన త‌రువాతనే అత‌డు త‌ల‌కు హెల్మెట్, చేతుల‌కు గ్లౌవ్స్ పెట్టుకున్నాడు. అయితే.. తొంద‌రో అత‌డు కాళ్ల‌కు ప్యాడ్లు ధ‌రించ‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో రవూఫ్ ఒక్క బంతిని కూడా ఎదుర్కొన‌లేదు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కే ప‌రిమితం అయ్యాడు.

Team India : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించ‌ని షాక్‌..! కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు ల‌క్ష్యాన్ని 18.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలింగ్‌లో మూడు ఓవ‌ర్లు వేసిన రవూఫ్ 20 ప‌రుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు.