Heinrich Klaasen: దంచికొట్టిన క్లాసెన్‌.. ఐపీఎల్‌లో తొలి శ‌త‌కం.. ఈ సీజ‌న్‌లో ఏడో సెంచ‌రీ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023 సీజ‌న్‌లో మ‌రో శ‌త‌కం న‌మోదైంది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెచ్ శ‌త‌క్కొట్టాడు.

Heinrich Klaasen: దంచికొట్టిన క్లాసెన్‌.. ఐపీఎల్‌లో తొలి శ‌త‌కం.. ఈ సీజ‌న్‌లో ఏడో సెంచ‌రీ

Heinrich Klaasen IPL Century ( Photo @ IPL)

Updated On : May 18, 2023 / 10:01 PM IST

Heinrich Klaasen IPL Century: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో మ‌రో శ‌త‌కం న‌మోదైంది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు( Royal Challengers Bangalore)తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెచ్(Heinrich Klaasen) శ‌త‌క్కొట్టాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో సిక్స్‌తో 49 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఆరు సిక్స‌ర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇది అత‌డికి మొద‌టి సెంచ‌రీ. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్‌లో క్లాసెన్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు సెంచ‌రీలు చేశారు. ఎస్ఆర్‌హెచ్ త‌రుపున ఇది రెండోది

ఈ సీజ‌న్‌లో సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితా ఇదే..

– హ్యారీ బ్రూక్(స‌న్‌రైజ‌ర్స్) కోల్‌క‌తా పై 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లతో 100 నాటౌట్
– వెంక‌టేశ్ అయ్య‌ర్‌(కోల్‌క‌తా) ముంబై పై 51 బంతుల్లో 6 పోర్లు, 9 సిక్స‌ర్లతో 104 ప‌రుగులు
– య‌శ‌స్వి జైశ్వాల్‌(రాజ‌స్థాన్‌) ముంబై పై 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స‌ర్లతో 124 ప‌రుగులు
– సూర్య‌కుమార్ యాద‌వ్‌(ముంబై) గుజ‌రాత్ పై 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులు
– ప్రభసిమ్రాన్ సింగ్ (పంజాబ్‌) ఢిల్లీ పై 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులు
– శుభ్‌మ‌న్ గిల్‌(గుజ‌రాత్‌) స‌న్‌రైజ‌ర్స్‌పై 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 101 ప‌రుగులు
– హెన్రిచ్ క్లాసెచ్ (స‌న్‌రైజ‌ర్స్‌) బెంగ‌ళూరుపై 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు 104తో ప‌రుగులు