IPL: 2013లో పూణేపై క్రిస్ గేల్ అత్యధిక స్కోరు… ఇప్పటివరకు ఆ రికార్డు చెక్కుచెదరలేదు.. టాప్-10 బ్యాటర్లు వీరే..
క్రిస్ గేల్ 2013 ఐపీఎల్ సీజన్ లో ఓ మ్యాచులో 175 పరుగులు బాదాడు. 10 ఏళ్ల నుంచి ఇంతకుమించి స్కోరు బాదిన మరో బ్యాటర్ లేడు.

IPL
IPL: వెస్టిండీస్ ఆల్ రౌండర్ క్రిస్ గేల్ 2013లో ఆర్సీబీ తరఫున ఆడి 175 (నాటౌట్) పరుగులు బాదాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన కేకేఆర్ బ్యాటర్ బీబీ మెక్కల్లమ్ ఆర్సీబీపై (2008లో 158 నాటౌట్) రికార్డును క్రిస్ గేల్ బద్దలు కొట్టాడు. 2013 సీజన్ నుంచి ఇప్పటివరకు పదేళ్లలో క్రిస్ గేల్ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు.
గత ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ కేకేఆర్ పై 140 (నాటౌట్) పరుగులు చేశాడు. ఈ ఏడాది ఏ బ్యాటర్ ఓ మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేస్తాడో చూడాలి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన టాప్-10 బ్యాటర్లు ఎవరో చూద్దాం…
టాప్-10
2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ పూణే వారియర్స్ పై 175 (నాటౌట్) పరుగులు
2008లో కేకేఆర్ బ్యాటర్ బీబీ మెక్కల్లమ్ ఆర్సీబీపై 158 (నాటౌట్)
2022లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ కేకేఆర్ పై 140 (నాటౌట్)
2015లో ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ముంబైపై 133 (నాటౌట్)
2020లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆర్సీబీపై 132 (నాటౌట్)
2016లో ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్ పై 129(నాటౌట్)
2012లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 128 (నాటౌట్)
2018లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటర్ రిషభ్ పంత్ సన్ రైజర్స్ పై 128 (నాటౌట్)
2010లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ విజయ్ రాజస్థాన్ రాయల్స్ పై 127
2017లో అప్పటి సన్‌రైజర్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కేకేఆర్ పై 126
IPL 2023, SRH vs RR: టార్గెట్ 204.. బ్యాటింగ్ లో తడబడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. Live Updates