ఇంగ్లాండ్‌తో డ్రా అయ్యిందిగా.. ఇక WTC ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించాలంటే ఇప్పుడెలా? ఏం జరుగుతుందంటే?

ఈ సైకిల్‌లో ఇండియా షెడ్యూల్ ప్రకారం.. తర్వాతి సిరీస్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులు ఇండియాలోనే జరగాల్సి ఉండడంతో మన జట్టు అన్ని మ్యాచ్‌లు గెలవవచ్చు.

ఇంగ్లాండ్‌తో డ్రా అయ్యిందిగా.. ఇక WTC ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించాలంటే ఇప్పుడెలా? ఏం జరుగుతుందంటే?

Pic- @icc

Updated On : August 4, 2025 / 5:25 PM IST

ఓవల్‌ వేదికగా జరిగిన 5వ టెస్టులో ఇంగ్లాండ్‌ను టీమిండియా 6 పరుగులతో ఓడించి సిరీస్‌ను 2-2తో ముగించింది. 374 లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో టీమిండియా గెలుపొందింది. టీమిండియా బౌలర్ సిరాజ్ 5 వికెట్లు తీసి జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు.

WTC 2027 ఫైనల్‌కు అర్హత ఎలా సాధించొచ్చు?
ఇండియా గత ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో ఓడి ఫైనల్‌కి వెళ్లలేదు. ఇప్పుడు 2025-2027 సైకిల్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ గెలుపుతో ఇండియా పాయింట్ల శాతం (పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ – PCT) 46.67కి చేరింది. ఇంగ్లాండ్ PCT 43.33కి తగ్గింది.

Also Read: ఒకే ఊరు.. 47 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. ప్రతి ఇంట్లో ఒక ఆఫీసర్.. ఇది ఇండియా ‘UPSC విలేజ్’ కథ.. ఎలా సాధ్యమైందంటే?

ఈ జట్టుకి ఎన్ని పాయింట్లు?

జట్టు మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా పాయింట్లు శాతం (PCT)
ఆస్ట్రేలియా 3 3 0 0 36 100.00%
శ్రీలంక 2 1 0 1 16 66.67%
ఇండియా 5 2 2 1 28 46.67%
ఇంగ్లాండ్ 5 2 2 1 26 43.33%
బంగ్లాదేశ్ 2 0 1 1 4 16.67%
వెస్టిండీస్ 3 0 3 0 0 0.00%
న్యూజిలాండ్ 0 0 0 0 0 0.00%
పాకిస్థాన్ 0 0 0 0 0 0.00%

 

ఈ గెలుపు ఇండియాకు ఫైనల్‌కు చేరే అవకాశాలను పెంచుతుంది. కానీ ఇది ప్రారంభ దశ మాత్రమే. ఈ సైకిల్‌లో ఇండియా షెడ్యూల్ ప్రకారం.. తర్వాతి సిరీస్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులు ఇండియాలోనే జరగాల్సి ఉండడంతో మన జట్టు అన్ని మ్యాచ్‌లు గెలవవచ్చు.

తర్వాత శ్రీలంకలో రెండు టెస్టులు జరుగుతాయి. ఇవి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో రెండు టెస్టులు ఉంటాయి. ఈ సిరీస్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఉంటుంది. గెలిస్తే ఫైనల్‌కి చేరే అవకాశాలు పెరుగుతాయి. చివరగా ఇండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల ఇంటి సిరీస్ ఆడుతుంది. నాలుగు మాత్రమే విదేశీ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఇండియాకు ఫైనల్‌కి వెళ్లే అవకాశం ఎక్కువుగా ఉన్నాయి. కానీ ఇతర టాప్ జట్లు ఎలా ఆడతాయన్నదీ కీలకమే.

అర్హత సాధించాలంటే భారత్ విదేశాల్లో ఓటములను తగ్గించాలి, ముఖ్యంగా న్యూజిలాండ్‌లో. ఇండియాలో ఎక్కువ మ్యాచ్‌లు ఉండటంతో భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయి. ఇతర ప్రధాన జట్లు (ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్) గట్టిపోటీనివ్వవచ్చు.