Uppal stadium : ఉప్ప‌ల్ మైదానానికి అవార్డు.. ప్రోత్సాహ‌కంగా రూ.50ల‌క్ష‌ల న‌గ‌దు..

ఉప్ప‌ల్ మైదానానికి అవార్డు ల‌భించింది.

Uppal stadium : ఉప్ప‌ల్ మైదానానికి అవార్డు.. ప్రోత్సాహ‌కంగా రూ.50ల‌క్ష‌ల న‌గ‌దు..

Hyderabad Uppal stadium won 50 Lakhs cash prize under BEST PITCH and GROUND

IPL 2024 – Uppal Stadium : ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసింది. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజేత‌గా నిలిచింది. ఎన్నో అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌నీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. దీంతో 8 వికెట్ల‌తో కోల్‌క‌తా ఘ‌న విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ సీజ‌న్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ డ‌కౌట్ కాగా.. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సైతం 2 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. గ‌త రెండు మ్యాచుల్లో దూకుడుగా ఆడిన రాహుల్ త్రిపాఠి (9) సైతం తొంద‌ర‌గానే ఔట్ అయ్యాడు. మార్‌క్ర‌మ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16)ల‌కు మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. ఆఖ‌ర్లో కెప్టెన్ క‌మిన్స్ (24) పోరాడ‌డంతో హైద‌రాబాద్ స్కోరు వంద ప‌రుగులు దాటింది.

IPL 2024 Prize Money : కోల్‌క‌తాకు రూ.20కోట్లు, స‌న్‌రైజ‌ర్స్ రూ.12.5కోట్లు, బెంగ‌ళూరుకు ఎంతంటే?

స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ (6) విఫ‌లం అయిన‌ప్ప‌టికీ మ‌రో ఓపెన‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ (39)తో క‌లిసి వెంక‌టేశ్ అయ్య‌ర్ (26 బంతుల్లో 52 నాటౌట్‌) దంచికొట్టాడు. దీంతో కోల్‌క‌తా 10.3 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది.

ఉప్ప‌ల్ గ్రౌండ్‌కు అవార్డు..

ఉప్ప‌ల్ మైదానానికి అవార్డు ల‌భించింది. అత్యుత్త‌మ పిచ్‌ను త‌యారు చేసినందుకు గాను ఉత్త‌మ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు ద‌క్కింది. ప్రోత్సాహ‌కంగా రూ.50ల‌క్ష‌ల న‌గ‌దు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌కు ల‌భించింది. ఈ అవార్డును ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ మెంబ‌ర్ ఛాముండేశ్వ‌రినాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహన్ రావు అందుకున్నారు.

IPL 2024 : అయ్యయ్యో.. ఎస్ఆర్‌హెచ్‌ ఓటమితో ఏడ్చేసిన కావ్యా పాప.. వీడియో వైరల్

కాగా.. ఈ సీజ‌న్‌లో 7 మ్యాచుల‌కు ఉప్ప‌ల్ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో గుజ‌రాత్‌-ఎస్ఆర్‌హెచ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. మిగిలిన మ్యాచులు అన్ని ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగాయి. బెంగ‌ళూరు జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ మిన‌హా మిగిలిన మ్యాచుల్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలిచింది.