ఐపీఎల్ మొత్తానికి నేనే మంచి స్పిన్నర్‌ని: అశ్విన్

ఐపీఎల్ మొత్తానికి నేనే మంచి స్పిన్నర్‌ని: అశ్విన్

Updated On : May 2, 2019 / 9:16 AM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా రెండో సంవత్సరం కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్‌ను అని చెప్పుకుంటున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 111వన్డేలు, 65టెస్టులు ఆడిన అశ్విన్ భారత్ తరపున జూన్ 2017 తర్వాత కేవలం టెస్టు ఫార్మాట్‌లోనే కనిపిస్తున్నాడు. 

ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపాడు. ఒకసారి నేను ఆడగలనని అనుకున్నాక.. నా పని నేను చేసుకుంటూ పోతా. 11సీజన్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్నా. దీనిని బట్టి తెలుస్తోంది నేను అత్యుత్తమ స్పిన్నర్‌గా రాణిస్తున్నానని. ఇతరులతో పోటీపడటానికి నేనెప్పుడు వెనుకడుగేయలేదు. సమయంతో పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకానొక దశలో మనకంటే మంచి ప్రదర్శన చేసేవాళ్లు రావొచ్చు’ అని తెలిపాడు. 

32ఏళ్ల అశ్విన్ 2018ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించాడు. 12 మ్యాచ్‌లు 14వికెట్లు తీసి సీజన్‌కే టాప్ బౌలర్‌గా నిలిచాడు. గత సీజన్లో మాదిరి ప్రదర్శన చేయలేకపోవడంతో పంజాబ్ ఐపీఎల్ 2019 సీజన్లో ప్లే ఆఫ్ కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు.