Srikar Bharat : వెస్టిండీస్ టూర్‌కు సిద్ధంగా ఉన్నా.. బాధ్య‌త మ‌రింత పెరిగింది

భారత యువ వికెట్ కీప‌ర్‌ శ్రీకర్ భరత్(Srikar Bharat) ను విశాఖ‌లో వీడిసిఏ సభ్యులు స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్ మాట్లాడుతూ భార‌త టెస్టు జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం చాలా సంతోషాన్ని క‌లిగించింద‌న్నాడు.

Srikar Bharat : వెస్టిండీస్ టూర్‌కు సిద్ధంగా ఉన్నా.. బాధ్య‌త మ‌రింత పెరిగింది

Srikar Bharat

Srikar Bharat wicket keeper : భారత యువ వికెట్ కీప‌ర్‌ శ్రీకర్ భరత్(Srikar Bharat) ను విశాఖ‌లో వీడిసిఏ సభ్యులు స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్ మాట్లాడుతూ భార‌త టెస్టు జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం చాలా సంతోషాన్ని క‌లిగించింద‌న్నాడు. వెస్టిండీస్ టూర్(West Indies tour ) కోసం ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పాడు. వెస్టిండీస్‌లో రాణించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాన‌న్నాడు. మూడు ఫార్మాట్లు(టెస్టులు, వ‌న్డేలు, టీ20లు)ల్లో రాణించ‌డం వెనుక కృషి ప‌ట్టుద‌లతో పాటు అంద‌రి స‌హ‌కారం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌తీ ఆట‌గాడు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడ‌డం చాలా అవ‌వ‌స‌రం అని, త‌ద్వారా మ‌రింత మెరుగు అవుతాడ‌ని తెలిపాడు. డీఆర్ఎస్ విష‌యంలో కెప్టెన్ త‌న నిర్ణ‌యానికి ప్రాధాన్య‌త ఇస్తుండ‌డంతో త‌న బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని భ‌ర‌త్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డేలు, టెస్టుల్లో పాల్గొనే భార‌త జ‌ట్ల‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నేడు ప్ర‌క‌టించింది. టెస్టు జ‌ట్టులో శ్రీక‌ర్ భ‌ర‌త్‌కు చోటు ద‌క్కింది. గ‌త కొంత‌కాలంగా భ‌ర‌త్‌ టెస్టు జ‌ట్టులో రెగ్యుల‌ర్ ఆట‌గాడిగా మారాడు. ఇటీవ‌ల‌ లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లోనూ భ‌ర‌త్ చోటు సంపాదించాడు. అయితే.. వికెట్ కీపింగ్‌లో అద‌ర‌గొడుతున్న భ‌ర‌త్ బ్యాటింగ్‌లో మాత్రం అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో బ్యాటింగ్‌లో సైతం అత‌డు రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

WI vs IND : పుజారా ఔట్‌.. జైశ్వాల్ ఇన్‌.. సంజు శాంస‌న్‌కు చోటు.. వెస్టిండీస్ టూర్‌కు భార‌త వ‌న్డే, టెస్టు జ‌ట్లు ఇవే

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త టెస్టు జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్‌సైని

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌లో భార‌త జ‌ట్టు రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. టెస్టు సిరీస్ జూలై 12 నుంచి, వ‌న్డే సిరీస్ జూలై 27 నుంచి, టీ 20 సిరీస్ ఆగ‌స్టు 3 నుంచి ఆరంభం కానుంది.

Suresh Raina : రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టిన చిన్న త‌లా.. యూర‌ప్ న‌డిబొడ్డున.. స్వ‌యంగా వంట చేసిన రైనా