MS Dhoni: ధోనీ లాంటి ఫినిషర్ కావాలని చూస్తున్నా – షారూఖ్ ఖాన్
తమిళనాడు ఆల్‌రౌండర్ షారూఖ్ ఖాన్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ఫినిషర్ కావాలంటుకుంటున్నానని అంటున్నాడు. ఇంకా తనకు సీనియర్ జట్టులో స్థానం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

Ms Dhoni
MS Dhoni: తమిళనాడు ఆల్‌రౌండర్ షారూఖ్ ఖాన్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ఫినిషర్ కావాలంటుకుంటున్నానని అంటున్నాడు. ఇంకా తనకు సీనియర్ జట్టులో స్థానం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. సయద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఐదు పరుగులు కావాల్సి ఉండగా చివరి బంతికి సిక్సు బాది లైమ్ లైట్ లోకి వచ్చాడు.
‘క్రీజులోకి వెళ్లినప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అవుతా. ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించను. ప్రశాంతంగా నా ఆట ఆడుకుంటా. గేమ్ పరిస్థితిని మార్చడం నాకు తెలుసు. నా జట్టు గెలవడం కోసం ప్రయత్నిస్తా. క్రీజులో ఉన్నంతసేపు ఎటువంటి ఒత్తిడిని తీసుకోను. అలా చేస్తే ఆ సమయంలో మొహంపైనే ఒత్తిడి కనిపిస్తుంది’
‘టీంతో కాకుండా వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడితే.. నా జట్టుకే ముందు ప్రాధాన్యతనిస్తా. నా గురించి ఆలోచించను. అందుకే ఒత్తిడిని ఫీల్ అవను. గేమ్ ఫినిషింగ్ విషయంలో ఎంఎస్ ధోనీని ఆదర్శంగా తీసుకుంటా. అతని లాగే ఫినిషర్ అవ్వాలని అనుకుంటున్నా’ అని చెప్తున్నాడు షారూఖ్.